- Home
- Sports
- Cricket
- వైస్ కెప్టెన్ సాబ్, మళ్లీ అట్టర్ ఫ్లాప్... కెఎల్ రాహుల్ పక్కనబెట్టి శుబ్‌మన్ గిల్‌ని ఆడించాలంటూ...
వైస్ కెప్టెన్ సాబ్, మళ్లీ అట్టర్ ఫ్లాప్... కెఎల్ రాహుల్ పక్కనబెట్టి శుబ్‌మన్ గిల్‌ని ఆడించాలంటూ...
కెఎల్ రాహుల్, ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తూ ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో టాప్ 3లో ఉండే ప్లేయర్. టెక్నిక్ విషయంలో రాహుల్ బ్యాటింగ్‌లో ఎలాంటి లోపం ఉండదు. క్లాస్ బ్యాటింగ్‌తో ఇరగదీసే కెఎల్ రాహుల్, టీమిండియా తరుపున మాత్రం నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు...

Image credit: Getty
2021 ఇంగ్లాండ్ టూర్‌లో తొలి టెస్టుకి ముందు మయాంక్ అగర్వాల్ నెట్స్‌లో గాయపడడంతో అతని ప్లేస్‌లో కెఎల్ రాహుల్‌కి అవకాశం వచ్చింది. రెండేళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, తొలి టెస్టులో సెంచరీ బాది టీమ్‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు...
Image credit: Getty
బీసీసీఐ పెద్దలకు అత్యంత ప్రీతిపాత్రుడైన కెఎల్ రాహుల్‌ని టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించింది బోర్డు. పేలవ ఫామ్‌తో టీ20ల్లో చోటు కోల్పోయి, వైట్ బాల్ ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు కెఎల్ రాహుల్...
KL Rahul-Dravid
అయితే టెస్టుల్లో మాత్రం కెఎల్ రాహుల్‌ని ఫ్యూచర్ కెప్టెన్‌గా ఫిక్స్ అయిపోయింది బీసీసీఐ. గత ఏడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనలో కెప్టెన్‌గా టెస్టు సిరీస్ కూడా గెలిచాడు కెఎల్ రాహుల్. బంగ్లాదేశ్ పసికూన అయినా, అదే టీమ్‌తో వన్డే సిరీస్‌ని కోల్పోయాడు రోహిత్ శర్మ..
KL Rahul
రోహిత్ శర్మ చేయలేని పని చేశాడని, కెఎల్ రాహుల్‌లో కెప్టెన్సీ స్కిల్స్‌ని అద్భుతమంటూ కొనియాడిన బీసీసీఐ, అతన్ని టెస్టు వైస్ కెప్టెన్‌గా కొనసాగిస్తూ వరుస అవకాశాలు ఇస్తోంది. అయితే వైస్ కెప్టెన్ సాబ్ మాత్రం వరుసగా విఫలమవుతూ నిలకడైన ఫెయిల్యూర్ ప్రదర్శన ఇస్తున్నాడు..
KL Rahul
2022 ఏడాది ఆరంభంలో జోహన్‌బర్గ్ టెస్టులో మొట్టమొదటిసారి కెప్టెన్సీ చేశాడు కెఎల్ రాహుల్. బీసీసీఐతో విభేదాలతో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ, రెండో టెస్టుకి దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
జోహన్‌బర్గ్‌లో ఇప్పటిదాకా ఒక్క టెస్టు కూడా ఓడని భారత జట్టు, రాహుల్ కెప్టెన్సీలో మొట్టమొదటి ఓటమి మూటకట్టుకుంది. కేప్ టౌన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 12, రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసిన రాహుల్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 22, 23, 10, 2 పరుగులు చేసి.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 57 పరుగులు బాదాడు..
KL Rahul
నాగ్‌పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకి అవుట్ అయ్యాడు. ఓ ప్లేయర్ ఇంతలా వరుసగా విఫలమవుతుంటే అతనికి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం అనేది కొద్దిమందికే పరిమితం...
ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే వంటి సీనియర్లను కూడా పేలవ ఫామ్ కారణంగా తప్పించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ మూడేళ్లుగా 30+ యావరేజ్ అందుకోలేకపోతున్నా... అతని టెస్టు రికార్డుల కారణంగా టీమ్‌లో కొనసాగిస్తోంది...
ఆడిలైడ్ టెస్టులో ఫెయిల్ అయ్యాడని పృథ్వీ షాని పక్కనబెట్టేసిన టీమిండియా, త్రిబుల్ సెంచరీ బాదిన కరణ్ నాయర్‌కి ఆ తర్వాత ఇచ్చింది మూడంటే మూడు మ్యాచులే. మరి కెఎల్ రాహుల్‌పై మాత్రం ఎందుకు ఇంత ప్రేమ?
మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చెప్పిన ఫేవరిజం? పక్షపాతం... కెఎల్ రాహుల్ మీద ఎంత ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడెప్పుడో ఓ సిరీస్‌లో బాగా ఆడాడని అతనికి వైస్ కెప్టెన్సీ అప్పజెప్పేసిన బోర్డు, శుబ్‌మన్ గిల్ లాంటి సూపర్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి కెఎల్ రాహుల్‌ని కొనసాగిస్తోంది..
KL Rahul-Virat Kohli
ఆరునూరైనా, మరో అరడజను మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయినా.. రోహిత్ శర్మ తర్వాత కెఎల్ రాహుల్‌కే, టీమిండియా టెస్టు కెప్టెన్సీ దక్కనుందని కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం మీద ఒట్టేసి చెబుతున్నారు..