- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ మూడ్ నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి... ఈ హ్యాంగోవర్ నుంచి బయటికి వస్తేనే...
ఐపీఎల్ మూడ్ నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి... ఈ హ్యాంగోవర్ నుంచి బయటికి వస్తేనే...
రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ పండగకి తెరపడింది. ఇక అందరి దృష్టి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి మళ్లింది. జూన్ 7 నుంచి మొదలయ్యే ఈ ఐసీసీ ఫైనల్‌లో టీమిండియా, ఆస్ట్రేలియాతో తలబడుతోంది...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఐపీఎల్ మ్యాచ్ విన్నర్లే, కీ ప్లేయర్లుగా మారబోతున్నారు. జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో 28 వికెట్లు తీసిన మహ్మద్ షమీయే టీమిండియాకి ప్రధాన ఫాస్ట్ బౌలర్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన శుబ్‌మన్ గిల్, ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 980 పరుగులు చేసి అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేయడంతో పాటు వన్డేల్లో డబుల్ సెంచరీతో మొత్తంగా 5 శతకాలు నమోదు చేశాడు...
అలాగే గత ఏడాదిగా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదాడు. 14 మ్యాచుల్లో 639 పరుగులు చేసి అదరగొట్టిన విరాట్ కోహ్లీ, 6 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
ఐపీఎల్ 2023 ఫైనల్‌లో విన్నింగ్స్ రన్స్ స్కోరు చేసిన రవీంద్ర జడేజా, బౌలింగ్‌లో 16 మ్యాచుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 175 పరుగులు చేశాడు... అలాగే అజింకా రహానే, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు...
అయితే వీరంతా ఇప్పుడు ఐపీఎల్ హ్యాంగోవర్ నుంచి బయటికి రావడమే అసలైన సవాల్. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడితేనే, ఆ తర్వాత టెస్టు మూడ్‌లోకి రావడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది రెండు నెలల పాటు ఐపీఎల్ ఫివర్‌లో మునిగి తేలారు భారత క్రికెటర్లు...
Image credit: Getty
ఫైనల్ మ్యాచ్ ఆడిన శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, అజింకా రహానేలకు ఆ సన్నివేశాలు... ఆ హ్యాంగోవర్ మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా ఇంకో నాలుగైదు రోజులు ఇదే చర్చ నడుస్తుంది. దీంతో దాన్నుంచి బయట పడేందుకు కాస్త సమయం పడుతుంది..
టీమిండియాతో పోలిస్తే ఆస్ట్రేలియా టీమ్‌లో ఏ ప్లేయర్ కూడా ప్లేఆఫ్స్ వరకూ ఆడలేదు. డేవిడ్ వార్నర్, కామెరూన్ గ్రీన్ తప్ప వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ ఆడబోయే టీమ్‌లో ప్లేయర్లు ఎవ్వరూ ఐపీఎల్‌లో అన్ని మ్యాచులు ఆడింది కూడా లేదు...
మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమ్మిన్స్ వంటి కీ ప్లేయర్లు, ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరంగా ఉండి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి మెంటల్‌గా, ఫిజికల్‌గా ప్రిపేర్ అయ్యారు. ఇది ఆస్ట్రేలియా జట్టుకి పెద్ద అడ్వాంటేజ్ కావచ్చు..
Image credit: PTI
అదీకాకుండా ఐపీఎల్ 2021 ఫస్ట్ ఫేజ్ ఆడిన తర్వాత ఆడిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 టోర్నీలో కూడా టీమిండియా ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
ఐపీఎల్ మూడ్ నుంచి మనోళ్లు టెస్టు మోడ్‌లోకి ఎంత త్వరగా స్వీచ్ అయితే టీమిండియాకి అంత మంచిది. ఫైనల్‌కి వారం రోజుల సమయం ఉన్నా ఇంగ్లాండ్ వాతావరణం, పిచ్, అక్కడి పరిస్థితులు, మనవాళ్ల కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. దీంతో భారత జట్టు మరింత కష్టపడక తప్పదు..