- Home
- Sports
- Cricket
- అసలే ఫామ్‌లో లేడు, ఆపై కెప్టెన్సీ భారం... విండీస్ టూర్‌లో ధావన్‌పై భారం వేసిన టీమిండియా..
అసలే ఫామ్‌లో లేడు, ఆపై కెప్టెన్సీ భారం... విండీస్ టూర్‌లో ధావన్‌పై భారం వేసిన టీమిండియా..
ఇంగ్లాండ్ టూర్‌లో ఐదో టెస్టులో ఓడినా ఆ తర్వాత టీ20, వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది భారత జట్టు. మొత్తానికి విజయవంతంగా ఇంగ్లాండ్ టూర్ ముగించుకున్న టీమిండియా... వన్డే, టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్‌కి బయలుదేరి వెళ్లనుంది...

Image credit: Getty
జూలై 22 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కి భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇంతకుముందు శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్‌కి కెప్టెన్‌గా ఇది రెండో టూర్...
Rohit Sharma and Shikhar Dhawan
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొన్న మెజారిటీ ప్లేయర్లకు వెస్టిండీస్ టూర్‌లో జరిగే వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీ... వన్డే సిరీస్‌లో పాల్గొనడం లేదు..
Image Credit: Getty Images
శిఖర్ ధావన్ ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేడు. అప్పుడెప్పుడో 2019 జూన్‌లో చివరిగా టీమిండియా తరుపున సెంచరీ చేసిన శిఖర్ ధావన్... మూడేళ్లుగా ఆ మార్కును అందుకోలేకపోతున్నాడు...
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 54 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన శిఖర్ ధావన్, రెండో వన్డేలో 26 బంతులాడి ఒక్క ఫోర్‌తో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
మూడో వన్డేలో 3 బంతులాడి ఒక్క పరుగు చేసిన శిఖర్ ధావన్, రీస్ టాప్లీ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా మూడు మ్యాచుల్లో కలిపి 41 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
Image Credit: Getty Images
అసలే ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న శిఖర్ ధావన్‌పై కెప్టెన్సీ భారం కూడా పడడంతో వెస్టిండీస్ టూర్‌లో భారత జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వగలదా? అనేది అనుమానంగా మారింది..
రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి కుర్రాళ్లుకు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో చోటు కల్పించిన సెలక్టర్లు... శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్ రూపంలో ముగ్గురు సీనియర్లకు అవకాశం ఇచ్చారు...
ఈ మధ్యకాలంలో పెద్దగా విజయాలు అందుకోలేకపోతున్నప్పటికీ స్వదేశంలో వెస్టిండీస్ ఎప్పుడూ టాప్ క్లాస్ టీమ్‌యే. ఇంగ్లాండ్‌ని టెస్టు సిరీస్‌లో ఓడించిన వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేతుల్లో వన్డే సిరీసుల్లో చిత్తుగా ఓడింది...
Shikhar Dhawan
ఈ పర్ఫామెన్స్ కారణంగా వన్డే సిరీస్‌కి భారత బీ జట్టుని ఆడించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే పేలవ ఫామ్‌లో ఉన్న గబ్బర్, ముందుండి టీమ్‌ని విజయ తీరాలకు చేర్చగలడా? అనేది మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది...
జూలై 22న తొలి వన్డే ఆడే భారత జట్టు, ఆ తర్వాత 24, 27 తేదీల్లో రెండు, మూడో వన్డే మ్యాచులను ఆడుతుంది. ఈ మూడు మ్యాచులన్నీ ట్రిడినాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లోనే జరుగుతాయి...