పంత్ రావాలి! పంత్ కావాలి... టీమిండియాకి అతని అవసరం ఉందంటున్న కపిల్ దేవ్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాకి ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు రిషబ్ పంత్. అయితే మొదటి మూడు మ్యాచుల్లో రిషబ్ పంత్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రిషబ్ పంత్, టీమిండియాలోకి రావాలంటూ కామెంట్ చేశాడు భారత మాజీ సారథి కపిల్ దేవ్...
Image credit: PTI
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయానికి ఆఖరి 5 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ మ్యాచ్‌ని ముగించలేకపోయాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు...
వికెట్ కీపింగ్‌లోనూ దినేశ్ కార్తీక్ పెద్దగా మెప్పించలేకపోతున్నాడు. దీంతో దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌కి టీమిండియాలో చోటు కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...
‘టీమిండియాకి రిషబ్ పంత్ అవసరం చాలా ఉంది. దినేశ్ కార్తీక్‌కి ఇచ్చిన అవకాశాలు చాలని నాకు అనిపిస్తోంది. అతను మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా మెప్పించలేకపోయాడు. అతని వికెట్ కీపింగ్ కూడా స్థాయికి తగ్గట్టు లేదు...
Image credit: Getty
అదీకాకుండా టీమిండియాకి లెఫ్ట్ హ్యాండర్ అవసరం చాలా ఉంది. భారత టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటె టీమ్ కంప్లీట్ అవుతుంది...అలాగని రిషబ్ పంత్ కోసం కెఎల్ రాహుల్‌ని తప్పించడం కరెక్ట్ కాదు...
Rishabh Pant-Rohit Sharma
కెఎల్ రాహుల్ చాలా నీట్ క్రికెటర్. అతని బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు. రాహుల్ అవుట్ అయ్యే విధానం గమనిస్తే పెద్దగా ఇబ్బంది పడుతున్నట్టు ఏమీ కనిపించదు. కెఎల్ రాహుల్ పరుగులు చేస్తే టీమిండియా టాపార్డర్ బలంగా మారుతుంది...
Image credit: PTI
అతను క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకుంటాడు. ఎప్పుడు స్పీడ్ పెంచాలో కెఎల్ రాహుల్‌కి బాగా తెలుసు.. 8-10 ఓవర్లు అవుట్ కాకుండా ఉంటే పిచ్‌ని అర్థం చేసుకుని వేగంగా పరుగులు చేయగలడు... ’ అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్...