- Home
- Sports
- Cricket
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి టీమిండియా... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి టీమిండియా... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు..
ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ప్లేస్‌కి ఎగబాకింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు టీమిండియాకి ఇది బూస్ట్ ఇచ్చే విషయం...

15 నెలలుగా టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతూ వస్తున్న ఆస్ట్రేలియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఫైనల్‌లో గెలిచే జట్టు, టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది..
2020 చివర్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను స్వదేశంలో క్లీన్ స్వీప్ చేసి, టెస్టుల్లో టాప్ పొజిషన్‌కి ఎగబాకింది ఆస్ట్రేలియా. అయితే ఆ సిరీస్‌లు జరిగి రెండేళ్లు కావడంతో మే 2020 నుంచి జరిగిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని టాప్ ప్లేస్‌ని డిసైడ్ చేసింది ఐసీసీ..
దీంతో 25 మ్యాచుల్లో 3031 పాయింట్లతో 121 రేటింగ్స్ సాధించిన టీమిండియా, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలవగా ఆస్ట్రేలియా 116 రేటింగ్స్‌తో రెండో స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్ జట్టు 114 పాయింట్లతో మూడో స్థానంలో ఉంటే సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి..
వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది టీమిండియా. ఆస్ట్రేలియా 113 పాయింట్లతో టాప్‌లో ఉంటే సరిగ్గా అన్నే పాయింట్లు సాధించిన న్యూజిలాండ్, ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌లు టాప్ ప్లేస్‌ని డిసైడ్ చేయబోతున్నాయి..
టీ20ల్లో కూడా టాప్‌లో కొనసాగుతోంది టీమిండియా. ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంటే, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతున్నాడు..
Image credit: Getty
టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా రెండో స్థానంలో ఉంటే, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ టాప్ 4లో, విరాట్ కోహ్లీ టాప్ 6లో ఉన్నారు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి ఎగబాకిన మహ్మద్ సిరాజ్, మూడో స్థానానికి పడిపోయాడు..
Mohammed Siraj
జోష్ హజల్‌వుడ్ టాప్‌లో ఉంటే, ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ టాప్‌లో ఉంటే టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా టాప్‌లో ఉన్నాడు. అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో ఉన్నారు.