- Home
- Sports
- Cricket
- మనకి ఎందుకు వచ్చిన ప్రయోగాలు రాహులా... 2007 వన్డే వరల్డ్ కప్‌కి ముందు ఏం జరిగిందో...
మనకి ఎందుకు వచ్చిన ప్రయోగాలు రాహులా... 2007 వన్డే వరల్డ్ కప్‌కి ముందు ఏం జరిగిందో...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత వెస్టిండీస్ టూర్‌కి వెళ్లింది భారత జట్టు. టెస్టు సిరీస్‌లో భారత సీనియర్ బ్యాటర్లు దుమ్మురేపి సెంచరీలు చేసుకున్నారు. అయితే వన్డే సిరీస్‌కి మాత్రం టీమిండియా ఫ్యాన్స్ ఆశించిన ఆరంభం దక్కలేదు..

Kuldeep Yadav
కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అద్భుత బౌలింగ్‌తో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 114 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా ఉన్న ఫామ్‌కి ఈ లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఊదేస్తారని అనుకున్నారు ఫ్యాన్స్...
అయితే కొట్టాల్సిన లక్ష్యం చాలా తక్కువ ఉండడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయగా వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కి వచ్చాడు.. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌కి వచ్చారు..
5 వికెట్లు పడిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి వస్తే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి ఈ ప్రయోగాలు కొత్తేమీ కాదు...
5 వికెట్లు పడిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి వస్తే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి ఈ ప్రయోగాలు కొత్తేమీ కాదు...
కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్, హెడ్ కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ ఉన్నప్పుడు టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేసిందో, ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లోనూ భారత జట్టు అదే విధంగా కనిపిస్తోంది...
ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ లేకుండా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడించిన రాహుల్ ద్రావిడ్, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో యజేంద్ర చాహాల్‌ని పూర్తిగా రిజర్వు బెంచ్‌కే పరిమితం చేశాడు..
Rahul Dravid-Rohit Sharma
జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి అసోసియేట్ దేశాలపై కూడా చిత్తుగా ఓడిన వెస్టిండీస్ జట్టు, టీమిండియాకి దాదాపు షాక్ ఇచ్చినంత పని చేసింది. వెస్టిండీస్ మరో 100+ పరుగులు చేసి ఉంటే.. రిజల్ట్ తేడా కొట్టేసినా కొట్టేసేది..
ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 వంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు ముందు టీమిండియా ఇలాంటి ప్రయోగాలు చేసి టీమ్ వాతావరణాన్ని పాడు చేయడం అవసరమా? అనేది భారత జట్టు ఫ్యాన్స్ ఆవేదన..