- Home
- Sports
- Cricket
- టీమిండియాకి షాక్... ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానానికి... టాప్‌లో ఇంగ్లాండ్...
టీమిండియాకి షాక్... ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానానికి... టాప్‌లో ఇంగ్లాండ్...
గబ్బాలో అద్భుత విజయం సాధించి, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లలో టాప్‌కి ఎగబాకిన టీమిండియా... ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఓటమి తర్వాత ఒక్కసారిగా నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం 430 పాయింట్లతో ఉన్న టీమిండియా విజయాల శాతం కేవలం 68.3 శాతం మాత్రమే. చెన్నైలో అద్భుత విజయం అందుకున్న ఇంగ్లాండ్ టాప్‌లోకి వెళ్లింది.

శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, తొలి టెస్టులో గెలవడంతో 70.2 శాతం విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్ టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ ఖాతాలో 442 పాయింట్లు ఉన్నాయి.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 14 మ్యాచులు ఆడిన టీమిండియా 9 మ్యాచుల్లో విజయం సాధించి, 4 మ్యాచుల్లో ఓడింది. సిడ్నీ టెస్టు మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఇప్పటికే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిన విషయం తెలిసిందే.

తొలి టెస్టు ఓడడంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరేందుకు భారత్ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు భారత జట్టు మిగిలిన మూడు టెస్టుల్లో మూడు విజయాలైనా అందుకోవాలి. లేదా కనీసం రెండు గెలిచి, ఓ టెస్టు డ్రా చేసుకోగలగాలి. లేదంటే ఫైనల్‌కి అర్హత కోల్పోతుంది.

మొదటి టెస్టు ఇంగ్లాండ్ గెలవడంతో ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరేందుకు అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు మిగిలిన మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ గెలిచి, రెండింట్లో ఓడినా... మూడు మ్యాచులు డ్రాగా ముగిసినా... ఒక్క మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచి, ఓ మ్యాచ్ టీమిండియా గెలిచినా ఆస్ట్రేలియానే ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది.

తొలి టెస్టు తర్వాత టీమిండియా ఫైనల్ చేరాలంటే 3-1 లేదా 2-1 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించాలి... ఇంగ్లాండ్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 1-3, 0-3, 0-4 తేడాతో టీమిండియాను ఓడించాలి. టెస్టు సిరీస్ 2-2, 1-1 తేడాతో డ్రాగా ముగిసినా... 0-1, 1-2, 0-2 తేడాతో ఇంగ్లాండ్ సొంతం చేసుకున్నా ఆస్ట్రేలియా ఫైనల్‌కి వెళ్తుంది.