ఆ ఇద్దరూ లేకపోతే అంతేనా! టీమిండియా బ్యాటింగ్‌లో కనిపించిన డొల్లతనం... విరాట్, రోహిత్‌పైనే...
సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్, మహేళ జయవర్థనే- కుమార సంగర్కర.. తర్వాత విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ రూపంలో ఒకే టీమ్‌లో ఇద్దరు స్టార్ బ్యాటర్లను చూసే అవకాశం నేటి తరానికి దక్కింది. ఈ ఇద్దరూ రిటైర్ అయితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Image credit: PTI
శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్... ఇలా చాలా మంది ప్లేయర్లు, ఫ్యూచర్ స్టార్లుగా, భవిష్యత్ ఆశాకిరణాలుగా కనిపించారు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా చేసిన ప్రయోగం... విరాట్, రోహిత్ లేకపోతే టీమ్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్‌కి ఓ శాంపిల్ చూపించింది..
దారుణమైన ఫామ్‌లో ఉండి, వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో అసోసియేట్ దేశాలపై కూడా గెలవలేకపోయిన వెస్టిండీస్ ప్రత్యర్థిగా ఉన్న మ్యాచ్‌లో 115 పరుగులు కొట్టడానికి 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా... ఎలాగోలా గెలిచినా వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఇది విజయం కిందకి రాదు, పెద్ద పరాభవమే..
Image credit: PTI
ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 5 సెంచరీలు, ఐపీఎల్ 2023 సీజన్‌లో 3 సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్‌తో పాటు ‘మిస్టర్ 360 డిగ్రీస్’ సూర్యకుమార్ యాదవ్ కూడా విండీస్ బౌలర్లపై ప్రతాపం చూపించలేకపోయారు..
హార్ధిక్ పాండ్యా అట్టర్ ఫ్లాప్ కాగా హాఫ్ సెంచరీ చేసుకున్న ఇషాన్ కిషన్, 115 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలోనూ ఆఖరి వరకూ ఉండి మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయాడు. పిచ్ ఎలా ఉన్నా, భారత బ్యాటర్లు ఆడిన విధానం మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది..
Image credit: Getty
రోహిత్ శర్మ వయసు ఇప్పటికే 36 ఏళ్లు దాటేసింది. విరాట్ కోహ్లీ కూడా 35 ఏళ్లకు చేరువయ్యాడు. రోహిత్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత రిటైర్ అవుతాడని బలంగా ప్రచారం జరుగుతోంది. విరాట్ కోహ్లీ కూడా వన్డే వరల్డ్ కప్ తర్వాత టెస్టులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టొచ్చు..
Kohli-Rohit
ఈ ఇద్దరూ లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి? అనే భయం అభిమానులను వెంటాడుతోంది. స్వదేశంలో దుమ్మురేపిన శుబ్‌మన్ గిల్, టీ20ల్లో అదరగొట్టే సూర్యకుమార్ యాదవ్, ఎప్పుడో ఆడతాడో అర్థం కాని ఇషాన్ కిషన్.. ఇలాంటి ప్లేయర్లు, టీమిండియాని విజయవంతంగా నడిపించగలరా? అనేది అభిమానులను కలవరపెడుతున్న విషయం...
Virat Kohli-Rohit Sharma
సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత ఎవరొస్తున్నారులే అనుకున్న అభిమానులకు ఓ విరాట్ కోహ్లీ కనిపించాడు. ధోనీ, యువరాజ్ పోయినా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ మ్యాచ్ విన్నర్లుగా మారారు.
ఇలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయితే యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లుగా మారాలి, లేదా ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల ప్లేయర్లు రావాలి.. లేకపోతే టీమిండియా పరిస్థితి కూడా శ్రీలంకలా మారుతుంది..