- Home
- Sports
- Cricket
- ఆసియా కప్ తర్వాత, వరల్డ్ కప్ ముందు! రాబోయే ఆరు నెలలు టీమిండియాకి ఫుల్ ప్యాక్ షెడ్యూల్...
ఆసియా కప్ తర్వాత, వరల్డ్ కప్ ముందు! రాబోయే ఆరు నెలలు టీమిండియాకి ఫుల్ ప్యాక్ షెడ్యూల్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత టీమిండియాకి నెల రోజుల బ్రేక్ దొరికింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత టీమిండియాకి ఇంత బ్రేక్ దొరకడం ఇదే తొలిసారి. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో ఉన్న టీమిండియా, రాబోయే ఆరు నెలలు యమా బీజీగా గడపనుంది..

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ని ముగించుకున్న భారత జట్టు, జూలై 27 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా, వెస్టిండీస్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతుంది..
వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్ స్వదేశానికి తిరిగి వస్తారు. మిగిలిన జట్టు మాత్రం ఐర్లాండ్ పర్యటనకి వెళ్లనుంది. ఈ పర్యటనలో రుతురాజ్ గైక్వాడ్, లేదా సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఆగస్టు 18 నుంచి ఆగస్టు 23 వరకూ మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది భారత జట్టు...
ఐర్లాండ్ టూర్ తర్వాత ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొంటుంది భారత జట్టు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ తర్వాత స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ కో... నెల రోజుల బ్రేక్ తర్వాత ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొంటారు.
ఆసియా కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ సెప్టెంబర్ 27 వరకూ సాగుతుంది. ఇది ముగిశాక అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం రెండు వార్మప్ మ్యాచులు ఆడుతుంది భారత జట్టు...
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టు, అక్కడ 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతుంది. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీని దృష్టిలో పెట్టుకుని, ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు అవకాశం ఇస్తారా? లేక కుర్రాళ్లనే కొనసాగిస్తారా? అనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది..
ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత అటు నుంచి సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టమిండియా. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు జరుగుతాయి. సౌతాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్ జరుగుతుంది..
2022 జూన్‌లో టీమిండియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడబోతున్నట్టు షెడ్యూల్ ప్రకటించింది ఆఫ్ఘాన్. అయితే టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా అది 2023 జూన్‌కి వాయిదా పడింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో మళ్లీ జనవరి 2024కి షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈసారి ఈ సిరీస్ కచ్ఛితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగించిన భారత జట్టు, ఈ ఏడాది డిసెంబర్ 26 వరకూ మళ్లీ టెస్టు జెర్సీలో కనిపించదు. దీంతో రవిచంద్రన్ అశ్విన్, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి ప్లేయర్లకు కావాల్సినంత బ్రేక్ దొరకనుంది.