MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నేను ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఉంటే మ్యాచ్ జరిగి ఉండేది... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...

నేను ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఉంటే మ్యాచ్ జరిగి ఉండేది... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ హెడ్ కోచ్‌లలో రవిశాస్త్రి ఒకరు. ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోయినప్పటికీ ఐదేళ్ల కాలంలో టీమిండియాని అత్యంత పటిస్టమైన టీమ్స్‌లో ఒకటిగా నిలిపాడు రవిశాస్త్రి... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి ప్రవేశించిన భారత జట్టు, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 24 2022, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Ravi Shastri and Virat Kohli

Ravi Shastri and Virat Kohli

గత ఏడాది ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా ప్రారంభమైన 29 రోజులకే బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, వృద్ధిమాన్ సాహా, సీఎస్‌కే బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టింది భారత జట్టు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా, మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు ఆరంభానికి ముందు అర్ధాంతరంగా ఆ మ్యాచ్ నుంచి తప్పుకుని... ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ కోసం యూఏఈ చేరుకుంది...

38

అప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, మాంచెస్టర్ టెస్టు జరిగి ఉంటే అక్కడే సిరీస్‌ని ముగించేసేది. అయితే భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో అది సాధ్యం కాలేదు. తాజాగా ఈ సంఘటనపై క్లారిటీ ఇచ్చాడు అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి..

48

‘నాకు గత ఏడాది కరోనా వచ్చిన సమయంలో జట్టుకి అందుబాటులో ఉండలేకపోయాను. కరోనా నెగిటివ్‌గా తేలిన తర్వాత కూడా బయో బబుల్ నిబంధనల కారణంగా టీమ్‌కి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ నేను 6 రోజుల తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌‌లోకి వెళ్లి ఉంటే... అప్పుడు ఆ మ్యాచ్ జరిగి ఉండేది..

58

ఐదో టెస్టు మ్యాచ్‌ జరిగి, సిరీస్‌ని 3-1 తేడాతో సొంతం చేసుకునేవాళ్లం కూడా. ఎందుకంటే అప్పుడు రిథమ్ మా వైపే ఉంది. కానీ కోవిద్ వల్ల అలా జరగలేదు. ఇప్పుడు కోవిద్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇప్పుడు అది ఓ సాధారణ ఫ్లూ మాత్రమే...

68

ఓ రెండు పారాసెటమల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమయానికి భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమ్‌కి అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ద్రావిడ్ లాంటి హెడ్ కోచ్ అండగా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల కొండంత బలం, ప్లేయర్లలో నిండుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

78

వాస్తవానికి 2021 ఇంగ్లాండ్ టూర్ మధ్యలో రద్దు కావడానికి కారణం కూడా రవిశాస్త్రియే. నిబంధనలకు విరుద్ధంగా ఇంగ్లాండ్‌లో జరిగిన తన పుస్తకావిష్కరణ సభకు విరాట్ కోహ్లీతో పాటు భారత బృందాన్ని మొత్తాన్ని తీసుకెళ్లాడు రవిశాస్త్రి...

88

ఈ ప్రోగ్రామ్ ముగిసిన నాలుగు రోజులకే రవిశాస్త్రి కరోనా పాజిటివ్‌గా తేలగా ఆ తర్వాత అప్పటి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌తో పాటు ఫిజియో‌థెరపిస్ట్, అసిస్టెంట్ ఫిజియో... ఇలా భారత బృందంలో వరుస కేసులు వెలుగుచూశాయి... 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image2
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Recommended image3
Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved