ముంబై ఇండియన్స్ చేసిన పనికి కుమిలిపోయిన హార్ధిక్ పాండ్యా... అక్కడే ఉండి ఉంటేనా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ ఆఖరి పొజిషన్‌లో నిలిచింది. భారీ అంచనాలతో సీజన్‌ని ఆరంభించిన ముంబై, అట్టర్ ఫ్లాప్ అయితే... ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, టైటిల్ గెలిచింది...

Image credit: Getty
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా పేరు ప్రకటించగానే అందరూ షాక్ అయ్యారు. రెండేళ్లుగా బౌలింగ్ చేయలేకపోతున్న హార్ధిక్ పాండ్యా, చెప్పుకోదగ్గ ఫామ్‌లో కూడా లేడు. అలాంటి పాండ్యాని రూ.15 కోట్లు పెట్టి కొని, కెప్టెన్సీ అప్పగించడం చాలా పెద్ద వ్యూహాత్మిక తప్పిదంగా పేర్కొన్నారు...
అయితే అందరి అంచనాలను తలకిందులు చేసిన హార్ధిక్ పాండ్యా, కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కి ఛాంపియన్‌గా నిలిపాడు. పాండ్యానిరిటైన్ చేసుకోని ముంబై ఇండియన్స్ భారీ మూల్యం చెల్లించుకుంది...
‘ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో తన పేరు లేకపోవడం చూసి హార్ధిక్ పాండ్యా షాక్ అయ్యాడు. తన టీమ్‌గా భావించిన ముంబై ఇండియన్స్ వదులుకోవడానికి సిద్ధం కావడాన్ని చూసి తట్టుకోలేక కుమిలిపోయాడు...
అయితే లక్కీగా అతన్ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. వేలానికి ముందే సొంత జట్టు గుజరాత్‌కి వెళ్లడం, అదీ కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు దక్కడంతో హార్ధిక్ పాండ్యాలో కొత్త కోణం బయటికి వచ్చింది...
ముంబై ఇండియన్స్ నుంచి బయటికి రావడం వల్లే హార్ధిక్ పాండ్యాలో కసి మరింత పెరిగింది. తనను తాను నిరూపించుకోవాలని మరింత కసిగా ప్రాక్టీస్ చేశాడు. సక్సెస్ అయ్యాడు... ముంబైలో ఉండి ఉంటే, అతని నుంచి ఇలాంటి పర్పామెన్స్ వచ్చి ఉండేది కాదేమో...
Image Credit: PTI
అయినా ముంబై ఇండియన్స్‌ది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ టీమ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, కిరన్ పోలార్డ్... ఇలా మ్యాచ్ విన్నర్లకు కొదువ లేదు. అందుకే వాళ్లు తిరిగి కొనుగోలు చేయగలమనుకున్నవాళ్లను వేలానికి వదిలేశారు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
Image credit: PTI
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ని రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. సీజన్‌లో 370 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, 2022 సీజన్‌లో ముంబై తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...
ముంబై ఇండియన్స్ నుంచి బయటికి వచ్చిన హార్ధిక్ పాండ్యా, 44.27 సగటుతో 487 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, మెరుపు ఫీల్డింగ్స్, రనౌట్లతో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు...