ధోనీని టీమ్ నుంచి తప్పించాలకున్న కోహ్లీ... సంచలన విషయాలు బయటపెట్టిన ఆర్ శ్రీధర్...
టీమిండియా మాజీ క్రికెటర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్... విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ఆటో బయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ఇండియన్ క్రికెట్ టీమ్’ పుస్తకంలో రాసుకొచ్చిన విషయాలు, క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి...
‘2016లో విరాట్ కోహ్లీ, టీమిండియా వైట్ బాల్ కెప్టెన్సీ కూడా కావాలనుకున్నాడు. టీమ్‌లో చేయాలనుకుంటున్న మార్పుల గురించికో రవిశాస్త్రితో చెప్పాడు...
‘విరాట్, ధోనీకి టెస్టు కెప్టెన్సీ ఇచ్చాడు. వైట్ బాల్ కెప్టెన్సీ కూడా ఇస్తాడు కానీ ఒపిక పట్టాలి. అతను మాజీ కెప్టెన్, తనకి గౌరవం ఇవ్వాలి. కరెక్టు సమయంలో నీకు కెప్టెన్సీ పగ్గాలు దక్కుతాయి...
నువ్వు కెప్టెన్‌వి అయినా ధోనీని గౌరవించాలి. లేకపోతే టీమ్ నిన్ను గౌరవించదు. టీమ్‌లో ఉన్నన్ని రోజులు ధోనీకి గౌరవం దక్కాలి... కెప్టెన్సీ కావాలని పట్టుబడటం కరెక్టు కాదు...’ అని రవిశాస్త్రి, కోహ్లీకి నచ్చజెప్పాడు...
MS DHONI
2019 వన్డే వరల్డ్ కప్ సమయంలోనే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని నాకు తెలుసు. 2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటన చేసినా అంతకుముందే ఆ విషయం నాకు తెలిసు.. మాంచెస్టర్‌లో రిజర్వు డేకి ముందు పంత్‌తో కలిసి ధోనీ ప్రాక్టీస్ సెషన్స్‌కి వచ్చాడు...
అప్పుడు రిషబ్ పంత్, ‘భయ్యా... కొందరు ప్రైవేటుగా లండన్‌కి వెళ్లాలనుకుంటున్నా... మీరు వస్తారా?’ అంటూ ధోనీని అడిగాడు. ‘నో రిషబ్, నేను టీమ్‌తో లాస్ట్ బస్సు మిస్ అవ్వకూడదని అనుకుంటున్నా...’ అంటూ మాహీ సమాధానం చెప్పాడు...
dhoni rishabh
2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయ్యాడని అప్పుడే అర్థమైంది. అయితే ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేకపోయాను...’ అంటూ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్, మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్..