- Home
- Sports
- Cricket
- క్రికెటర్లే కాదు, జనాలు కూడా అంతే! ఐసీసీ ట్రోఫీ కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యం... రోహిత్ శర్మ చెప్పినదానికి
క్రికెటర్లే కాదు, జనాలు కూడా అంతే! ఐసీసీ ట్రోఫీ కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యం... రోహిత్ శర్మ చెప్పినదానికి
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ఓటమిపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా టీమిండియా ఐసీసీ టోర్నీల్లో నిరాశపరుస్తూనే ఉంది. కెప్టెన్లు మారినా, హెడ్ కోచ్‌లు మారినా ఐసీసీ టైటిల్ మాత్రం రావడం లేదు..

Virat Kohli
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా అందరూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక్క అజింకా రహానే తప్ప మిగిలిన ఎవ్వరూ పెద్దగా పోరాడలేకపోయారు...
ఐపీఎల్ 2023 సీజన్‌లో 28 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నాలుగే వికెట్లు తీశాడు. బౌలింగ్ యూనిట్ నుంచి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. దీంతో టీమ్‌లో సమూల మార్పులు అవసరమని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు..
భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్‌తో పాటు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా టీమిండియా ఆటతీరు మాత్రమే కాదు, మైండ్‌సెట్ కూడా సరిగా లేదని కామెంట్లు చేశారు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫుల్లుగా ఆడి టీ20 క్రికెట్‌లో మునిగి తేలారు భారత క్రికెటర్లు. ఈ ఎఫెక్ట్ ఫైనల్‌లో బాగా కనిపించింది...
కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి సిద్ధం అయ్యేందుకు 25 రోజుల సమయం కావాలని కామెంట్ చేశాడు. దానికి రవిశాస్త్రి, అన్ని రోజులు కావాలంటే ఐపీఎల్ ఆడడం మానేయాలంటూ కౌంటర్ ఇచ్చాడు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా ప్లేయర్లు (డేవిడ్ వార్నర్ తప్ప), ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్నారు. మెంటల్‌గా, ఫిజికల్‌గా ఆ మ్యాచ్‌కి సిద్దమయ్యారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడకుండా రెస్ట్ తీసుకునేందుకు కూడా మనోళ్లకు మనసొప్పలేదు..
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు అవసరమైతే భారత జట్టు ప్లేయర్లను, ప్లేఆఫ్స్ మ్యాచులకు దూరం పెట్టేలా ఫ్రాంఛైజీలకు సూచనలు ఇస్తామని కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి చేరడంతో రోహిత్ శర్మ కూడా రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ దాకా ఐపీఎల్ 2023 సీజన్ ఆడాడు.. అక్కడే మన క్రికెటర్లకు ఏది ముఖ్యమో, ఏం కావాలో క్లియర్‌గా తెలిసిపోతోంది.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న విమర్శలు, వస్తున్న ట్రోల్స్ కొన్నిరోజులే. వచ్చే నెలలో వెస్టిండీస్ సిరీస్ మొదలవ్వగానే అందరూ దీన్ని మరిచిపోతారు. ఆ తర్వాత ఆసియా కప్, 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీల మీదకి ఫోకస్ వెళ్లిపోతుంది...
ఒకవేళ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయినా పెద్దగా నష్టమేమీ ఉండదు. దాని గురించి కొన్నిరోజులు చర్చ జరగ్గానే ఐపీఎల్ 2024 వేలానికి సంబంధించిన వార్తలు వచ్చేశాయి. ఇంకేముంది ఐపీఎల్ బ్యాన్ చేయాలి? అని డిమాండ్ చేసిన వాళ్లే, ఏ టీమ్ ఎవరిని వేలానికి వదిలేసిందబ్బా? అని ఆసక్తిగా చూస్తారు...
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్కో మ్యాచ్‌కి 3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రియల్ టైం 30 లక్షలు కూడా దాటలేదు. టీమిండియా ప్లేయర్లు మాత్రమే కాదు, జనాలు కూడా ఐసీసీ ట్రోఫీల కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఇక్కడే తేలిపోయింది..