షాహీన్ ఆఫ్రిదీ నిజంగా గాయపడ్డాడా? డ్రామా చేశాడా... మాథ్యూ వేడ్ కొట్టిన హ్యాట్రిక్ సిక్సర్ల భయంతో...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం అందుకుంది. బౌలింగ్‌లో, బ్యాటింగ్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపించి 5 వికెట్ల తేడాతో రెండోసారి పొట్టి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడిన పాకిస్తాన్, విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది...
2.1 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి, డేంజరస్ మ్యాన్ అలెక్స్ హేల్స్‌ని అవుట్ చేసిన షాహీన్ షా ఆఫ్రిదీ... హారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకునే సమయంలో గాయపడ్డాడు. ఆ తర్వాత 17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన ఆఫ్రిదీ... ఒక్క బంతి మాత్రమే వేసి నొప్పితో పెవిలియన్ చేరాడు...
అయితే షాహీన్ షా ఆఫ్రిదీ నిజంగా గాయపడ్డాడా? లేక డ్రామా చేశాడా? అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. దీనికి కారణం షాహీన్ ఆఫ్రిదీ క్యాచ్ అందుకునే సమయంలో కింద పడినా... మరి తీవ్ర గాయమైనట్టు అనిపించలేదు...
Matthew Wade
అదీకాకుండా 2021 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. షాహీన్ షా ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్... వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించేశాడు...
అంతకుముందు ఓవర్‌లో మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ని హసన్ ఆలీ డ్రాప్ చేయడంతో షాహీన్ షా ఆఫ్రిదీ ఇచ్చిన మూడు సిక్సర్లను పెద్దగా పట్టించుకోలేదు విమర్శకులు. హసన్ ఆలీ అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌ని విమర్శించారు...
ఈ అనుభవంతోనే షాహీన్ షా ఆఫ్రిదీ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేందుకు భయపడి ఉంటాడని... అందుకే గాయం వంకతో మ్యాచ్ మధ్యలో పెవిలియన్ చేరాడని అంటున్నారు. అందుకే పాక్‌లో మాత్రం షాహీన్ ఆఫ్రిదీపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి...
world cup
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు షాహీన్ షా ఆఫ్రిదీ తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే టీ20 వరల్డ్ కప్ 202 టోర్నీలో అతన్ని ఆడించింది పాకిస్తాన్...
shaheen
7 మ్యాచుల్లో 11 వికెట్లు తీసి పాక్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన షాహీన్ ఆఫ్రిదీ... క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడడంతో మోకాలి గాయం తిరగబెట్టి ఉంటుందని అంటున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్..