- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ చూసి కెప్టెన్సీ ఇవ్వడమే బీసీసీఐ చేసిన అతి పెద్ద తప్పా? హార్ధిక్, రోహిత్ కంటే కోహ్లీయే చాలా బెటర్..
ఐపీఎల్ చూసి కెప్టెన్సీ ఇవ్వడమే బీసీసీఐ చేసిన అతి పెద్ద తప్పా? హార్ధిక్, రోహిత్ కంటే కోహ్లీయే చాలా బెటర్..
వెస్టిండీస్ టూర్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, టీ20 సిరీస్‌ని ఓడిపోయింది. ఓ టీ20 సిరీస్‌లో మూడు మ్యాచుల్లో టీమిండియా ఓడడం ఇదే తొలిసారి. గత ఏడాదిన్నరలో ఇలాంటి ఓటములు, ఒకటి కాదు, అనేకం చూసింది భారత జట్టు..

Varun Chakravarthy
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది భారత జట్టు. ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్ వంటి ప్లేయర్లను వరల్డ్ కప్‌కి సెలక్ట్ చేసిన సెలక్టర్లు, యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి చాలా పెద్ద తప్పు చేశారు...
ఈ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీకి రాజీనామా ఇవ్వగా వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించింది బీసీసీఐ. సౌతాఫ్రికా టూర్‌లో మొదటి టెస్టు గెలిచిన విరాట్ కోహ్లీ, రెండో టెస్టు నుంచి కావాలని తప్పుకున్నాడు. ఆ తర్వాత మూడో టెస్టు ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికేశాడు..
Virat Kohli and Rohit Sharma
సౌతాఫ్రికా టూర్‌లో తొలి టెస్టు గెలిచిన తర్వాత కూడా 2-1 తేడాతో టెస్టు కోల్పోయిన భారత జట్టు, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. అంతకుముందు సౌతాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్డే సిరీస్ గెలిచిన భారత జట్టు, బీసీసీఐ కారణంగా ఆ ఫీట్ రిపీట్ చేయలేకపోయింది..
ఈ పరాజయాల పరంపర ఆ ఒక్క టూర్‌తో ఆగలేదు. ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిన టీమిండియా, ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టూర్‌లో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఏడాది వాయిదా పడిన ఐదో టెస్టుని జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో ఆడింది. ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడి సిరీస్‌ని 2-2 డ్రా చేసుకుంది భారత జట్టు..
విరాట్ కోహ్లీ పేలవ కెప్టెన్సీలో వల్లే 2021 వరల్డ్ కప్‌లో పాక్ చేతుల్లో టీమిండియా ఓడిందని కామెంట్ చేసిన వాళ్లకు, 2022 వరల్డ్ కప్‌లో ఊహించని షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ వల్లే పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయం అందుకుంది. ఆ తర్వాత సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా..
టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత బంగ్లాదేశ్ టూర్‌లో రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాతోనూ వన్డే సిరీస్ కోల్పోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్స్ గెలుస్తుందని అనుకున్న భారత జట్టు, పరిస్థితులు బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఓడింది..
తాజాగా వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌తో పాటు రెండో వన్డేలోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మొదటి వన్డేలో 115 పరుగుల లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయి, చచ్చీ చెడీ గెలిచింది భారత జట్టు.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్స్ గెలవకపోయినా ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం దుమ్ముదులుపుతూ వచ్చింది టీమిండియా..
అలాంటిది ఐపీఎల్ సక్సెస్ చూసి రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలకు కెప్టెన్సీ ఇవ్వడమే బీసీసీఐ చేసిన అతి పెద్ద తప్పిదంగా మారింది. రాబోయే ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో టీమిండియా పర్ఫామెన్స్ తేడా కొడితే... భారత జట్టులో సంచలన మార్పులు జరగడం ఖాయం..
సీనియర్లు లేరు, అందుకే మ్యాచులు ఓడిపోతున్నామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టులో ఆసీస్ కంచుకోటను కూల్చింది టీమిండియా. ఆ మ్యాచ్‌లో ముగ్గురు కొత్త కుర్రాళ్లు, మరో ముగ్గురు 3 మ్యాచుల అనుభవం మాత్రమే ఉన్న ప్లేయర్లు. అప్పటితో పోలిస్తే వెస్టిండీస్‌లో టీ20 సిరీస్ ఓడిన ఇప్పటి టీమిండియాకి అనుభవం ఎక్కువే..