పాక్‌ని ఇంటికి పంపించాం సరే, ఆ మ్యాచుల్లో ఓడితే టీమిండియా పరిస్థితి ఏంటి... టీ20 వరల్డ్ కప్‌లో...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా మరో 2 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది.. ఈ పరాజయంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి...
Image credit: PTI
టీమిండియా చేతుల్లో ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ 1 పరుగు తేడాతో ఓడింది. దీంతో మిగిలిన మూడు మ్యాచుల్లో పాక్ గెలిచినా 6 పాయింట్లతోనే ఉంటుంది. జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్, వర్షం కారణంగా రద్దయినా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో నెగ్గిన సౌతాఫ్రికా ఇప్పటికే 5 పాయింట్లు సాధించింది...
Image credit: PTI
తర్వాతి మ్యాచుల్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడనున్న సఫారీ జట్టు, వీటిల్లో ఒక్కటి గెలిచినా 7 పాయింట్లతో సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్, టీమిండియా జట్లు నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి.
ఈ రెండు జట్లకు మిగిలిన రెండు మ్యాచులు సెమీస్ బెర్తులను డిసైడ్ చేయబోతున్నాయి. సఫారీ టీమ్ చేతుల్లో ఓడిన టీమిండియా, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాతి రోజు పాకిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది...
Pakistan vs Zimbabwe
ఒకవేళ టీమిండియా, బంగ్లా చేతుల్లో ఓటమి ఎదుర్కొని, పాకిస్తాన్, సౌతాఫ్రికాపై గెలిస్తే... సెమీస్ రేసు తలకిందులవుతుంది. సౌతాఫ్రికాతో పాటు బంగ్లాదేశ్ సెమీస్ రేసులో నిలిస్తే... టీమిండియాతో పాటు పాకిస్తాన్ కూడా నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితుల్లో పడిపోతాయి...
bangladesh
మొత్తానికి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడి పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలను తగ్గించిన టీమిండియా... తన ప్లేస్‌ని కూడా కాస్త ఇరకాటంలోనే పడేసింది. పసికూన జింబాబ్వే టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ టాప్ టీమ్‌కి చెమటలు పట్టిస్తోంది.
బంగ్లాదేశ్ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం... సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడిన బారత జట్టు, మిగిలిన ఈ రెండు మ్యాచుల్లో భారత జట్టు గెలిస్తేనే ... మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది..