టీమిండియానా.. మజాకా! ఆ యూట్యూబ్ ఛానెల్ జాతకాన్ని మార్చేసిన వార్మప్ మ్యాచ్...
భారత్‌లో టీమిండియాకి ఉండే క్రేజ్, భారత క్రికెట్ బోర్డును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డును మార్చేసింది. ఇదే బీసీసీఐకి, ఐపీఎల్ ద్వారా రూ.48 వేల కోట్లు ఆర్జించేలా చేసింది.. ఇప్పుడు ఇదే క్రికెట్ క్రేజ్ కారణంగా లీస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ యూట్యూబ్ ఛానెల్ జాతకమే మారిపోయింది...

Virat Kohli
వాయిదా పడిన ఐదో టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ చేరిన భారత జట్టు, అక్కడ లీస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది...
దాదాపు నెల రోజుల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్... ఈ వార్మప్ మ్యాచ్‌లో బరిలో దిగబోతున్నారు.
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడి నాలుగు సెంచరీలతో అదరగొట్టిన భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా టీమిండియా తరుపున కాకుండా లీస్టర్‌షైర్ తరుపున ఆడుతుండడం విశేషం...
టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ ఏ ఛానెల్‌లో ప్రసారం కావడం లేదు. లీస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌కి చెందిన యూట్యూబ్ ఛానెల్ ‘ఫాక్సెస్ టీవీ’లో భారత్ వర్సెస్ లంకాషైర్ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ప్రత్యేక్షప్రసారమైంది..
మొదటి రోజు వార్మప్ మ్యాచ్‌కి ముందు ఫాక్సెస్ టీవీ యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 47 వేలు మాత్రమే. మొదటి రోజు ఆట తర్వాత ఈ సంఖ్య ఏకంగా లక్షా 12 వేలకుపైగా చేరింది. నాలుగు రోజుల ఆట ముగిసే సమయానికి ఈ సంఖ్య 2 నుంచి 3 లక్షలు దాటేస్తుందని అంచనా..
భారత జట్టు, లీస్టర్‌షైర్తో జరిగిన వార్మప్ మ్యాచ్ మొదటి రోజు ఆటను 44 లక్షల మంది అభిమానులు వీక్షించగా, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లో 80 వేల మంది రియల్ టైమ్ మ్యాచ్‌ని వీక్షించడం విశేషం..