తేరుకునేలోగా అంతా జరిగిపోయింది... గాయంతో షమీ దూరం? వార్నర్ రీఎంట్రీ కన్ఫార్మ్...
First Published Dec 19, 2020, 2:12 PM IST
ఒకే ఒక్క రోజు... రోజంతా కూడా కాదు. కేవలం 90 నిమిషాల్లో అంతా అయిపోయింది. పింక్ బాల్ టెస్టులో భారత జట్టుదే విజయం అనుకుని ధీమాగా ఉన్న భారత జట్టుకి... ఆడిలైడ్‌లో అనుకోని షాక్ తగిలింది. నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థి బౌలర్లు విసిరిన బంతులు, భారత ఫీల్డర్లు చేసిన తప్పులు చేయకుండా మెరుపు వేగంగా ఆసీస్ ఫీల్డర్లు అందుకున్న క్యాచ్‌లు... ఫలితం భారత అభిమానులు కలలో కూడా కోరుకోనిది.

చారిత్రక పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టుకి మరో షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన మహ్మద్ షమీ... రెండో టెస్టులో బరిలో దిగడం కష్టంగానే కనిపిస్తోంది.

‘షమీ చేతిని పైకెత్తలేకపోతున్నాడు. స్కానింగ్ కోసం పంపించాం. రిపోర్టులు వస్తే కానీ షమీ గాయం తీవ్రత గురించి తెలీదు... సాయంత్రానికి విషయం తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?