- Home
- Sports
- Cricket
- Virat Kohli: అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో కోహ్లి.. భారత్ నుంచి ఈ ఘనత సాధించబోయే తొలి క్రికెటర్ అతడే..
Virat Kohli: అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో కోహ్లి.. భారత్ నుంచి ఈ ఘనత సాధించబోయే తొలి క్రికెటర్ అతడే..
IPL 2021 RCB vs MI: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు పదమూడు పరుగులు దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగే మ్యాచ్ లో కోహ్లి ఆ పరుగులు చేస్తే భారత క్రికెట్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు పుటల్లో నిలువనున్నాడు.

<p>virat kohli</p>
రాయల్ ఛాలెంజర్స్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన మైలురాయికి అడుగు దూరంలో నిలిచాడు. నేటి మ్యాచ్ లో అతడు 13 పరుగులు చేస్తే చాలు. ఆ రికార్డు అతడి సొంతం కానున్నది.
శుక్రవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన కోహ్లికి ఈ రికార్డు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
Virat Kohli
టీ20 క్రికెట్ లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి ఆర్సీబీ కెప్టెన్ కు మరో 13 పరుగులు మాత్రమే కావాల్సి ఉన్నాయి.
virat
ఇప్పటిదాకా 313 టీ20 లు ఆడిన విరాట్.. 9,987 పరుగులు చేశాడు. ముంబయితో మ్యాచ్ లో కొద్దిసేపు నిలిచినా ఈ మైలురాయి సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లి చరిత్ర పుటల్లో నిలువనున్నాడు.
ఇవాల్టి మ్యాచ్ లో గనుక కోహ్లి ఈ రికార్డు అందుకుంటే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదవ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించినవాడవుతాడు.
Virat Kohli
కోహ్లి కంటే ముందు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, పొలార్డ్, పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్, ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 10,000 పరుగులు చేసిన జాబితాలో ఉన్నారు.