- Home
- Sports
- Cricket
- తీవ్రమైన ప్రెషర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ... డీఆర్‌ఎస్ రివ్యూలు వేస్ట్! బౌలర్లను మార్చడంలోనూ తికమక..
తీవ్రమైన ప్రెషర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ... డీఆర్‌ఎస్ రివ్యూలు వేస్ట్! బౌలర్లను మార్చడంలోనూ తికమక..
కెప్టెన్‌గా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అప్పుడెప్పుడో 2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్, కెప్టెన్‌గా ప్రమోషన్ పొందడానికి 14 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది...

Image credit: PTI
భారీ అంచనాలతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, బీసీసీఐ ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విఫలమైన రోహిత్ శర్మ, స్వదేశంలో జరిగే సిరీసుల్లో మాత్రం ఘన విజయాలు అందుకున్నాడు...
Image credit: Getty
బంగ్లా టూర్‌లో వన్డే సిరీస్‌ని కోల్పోయిన రోహిత్ శర్మ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి రెండు టెస్టులు గెలిచి 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిపాడు. అయితే ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది...
Rohit Sharma-Virat Kohli
12 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అనవసర షాట్‌కి ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద రోహిత్ వికెట్ కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది... ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది...
Rohit Sharma
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్వల్ప స్కోరుకే ఆలౌట్ కావడంతో రోహిత్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అతను చేస్తున్న తప్పులే రోహిత్ ఎంత ప్రెషర్‌లో ఉన్నాడో క్లియర్‌గా తెలియచేస్తోంది...
స్పిన్‌కి అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై అశ్విన్, జడేజాలతో ఓపెనింగ్ చేయించాడు రోహిత్ శర్మ. జడేజా రెండో ఓవర్‌లోనే వికెట్ తీసి టీమిండియాకి బ్రేక్ అందించాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చినా డీఆర్‌ఎస్‌కి వెళ్లిన టీమిండియాకి ట్రావిస్ హెడ్ వికెట్ దక్కింది...
ఒక్కసారి డీఆర్‌ఎస్ సక్సెస్ అయ్యిందనే ఉద్దేశంతో జడేజా, అప్పీలు చేసిన ప్రతీసారీ అతన్ని నమ్మి డీఆర్‌ఎస్ తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఫలితం 40 ఓవర్లలోనే మూడు డీఆర్‌ఎస్ రివ్యూలను కోల్పోయింది టీమిండియా. జడేజా మూడో రివ్యూ వేస్ట్ చేయడానికి ముందు అశ్విన్, డీఆర్‌ఎస్ తీసుకోవాల్సిందిగా కోరాడు..
Image credit: PTI
అయితే ఒకే రివ్యూ మిగలడంతో డీఆర్‌ఎస్ తీసుకోలేదు రోహిత్. అయితే అది రిప్లైలో క్లియర్ అవుట్‌గా కనిపించింది. జడేజా ఈ సిరీస్‌లో 21 వికెట్లు తీశాడు. అతన్ని నమ్మడంలో తప్పు లేదు. అయితే ప్రతీ బౌలర్ కూడా కాలికి బంతి తగిలిన ప్రతీసారీ అవుట్ అనే అనుకుంటాడు...
Image credit: Getty
డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకునే విషయంలో వికెట్ కీపర్ అభిప్రాయం కూడా చాలా కీలకం. రిషబ్ పంత్, ఎప్పుడు డీఆర్‌ఎస్ తీసుకోవాలో చెప్పేవాడు. చాలాసార్లు అతని అభిప్రాయం తప్పు అయినా కొన్నిసార్లు అయినా టీమిండియాకి ఉపయోగపడింది...
Image credit: PTI
విరాట్ కోహ్లీ కూడా డీఆర్‌ఎస్ రివ్యూలను వేస్ట్ చేసేవాడు. అయితే అతను అశ్విన్ కోసం రివ్యూలను వేస్ట్ చేస్తే, రోహిత్, జడేజా కోసం వాడేశాడు. బౌలింగ్ మార్పుల విషయంలోనూ రోహిత్ శర్మ, మూడో టెస్టులో చురుగ్గా వ్యవహరించలేకపోయాడు...
క్రీజులో ఉన్న బ్యాటర్లను బట్టి, వారి వీక్‌నెస్‌ని అంచనా వేసి బౌలింగ్ మార్పులు చేశాడు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్. రోహిత్ శర్మ మాత్రం వికెట్లు పడకపోయినా 30 ఓవర్ల పాటు అశ్విన్, జడేజాలను కంటిన్యూ చేయించాడు. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లను వాడుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు..
Image credit: PTI
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్, 35 ఓవర్లు ముగిసిన తర్వాత బౌలింగ్‌కి వచ్చాడు. అసలు సిరాజ్ ఉన్నాడనే విషయమే రోహిత్ మరిచిపోయినట్టు కనిపించింది. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు...
Image credit: Getty
జాక్ లీచ్‌తో పాటు జో రూట్ కూడా బౌలింగ్ చేసి వికెట్లు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మెయిన్ స్పిన్నర్లు ఫెయిలైనప్పుడు పార్ట్ టైమ్ స్పిన్నర్లు సూపర్ సక్సెస్ అవుతారు. అయితే అశ్విన్, జడేజా మాత్రమే వికెట్లు తీయగలరని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినట్టు వారితోనే బౌలింగ్ చేయించాడు రోహిత్...
Image credit: PTI
తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయినా, భారీ స్కోరు చేయడానికి రెండో ఇన్నింగ్స్ రూపంలో మరో ఛాన్స్ ఉంది. అయితే దానికి ముందు ఆస్ట్రేలియాని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. అది చేయాలంటే రోహిత్ చురుగ్గా ఆలోచించాలి...
Ravindra Jadeja and Axar Patel
అక్షర్ పటేల్‌కి ఇండియాలో అద్భుతమైన రికార్డు ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 3 మ్యాచుల్లో ఐదు సార్లు ఐదేసి వికెట్లు తీశాడు అక్షర్ పటేల్. అలాంటి అక్షర్ పటేల్‌ని బౌలర్‌గా పెద్దగా వాడుకోలేకపోతున్నాడు రోహిత్ శర్మ..