- Home
- Sports
- Cricket
- పాకిస్తాన్, టీమిండియా బౌలింగ్ మధ్య ఇంత తేడా... ఇంకా వరల్డ్ కప్ గెలుస్తుందనే ఆశలు ఉన్నాయా?
పాకిస్తాన్, టీమిండియా బౌలింగ్ మధ్య ఇంత తేడా... ఇంకా వరల్డ్ కప్ గెలుస్తుందనే ఆశలు ఉన్నాయా?
2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా, కెప్టెన్‌గా 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై బోలెడు ఆశలు ఉన్నాయి.. అయితే ఆసియా కప్‌లో ఆ ఆశలపై నీళ్లు చల్లుతోంది టీమిండియా..

India Vs Nepal
వెస్టిండీస్ టూర్‌లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయి, అపసోపాలు పడింది భారత జట్టు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసినా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ అతనికి సరైన సహకారం అందించలేకపోయారు..
పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషనే ఆపద్భాంధవుడిగా మారాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. పాక్ పేస్ బౌలింగ్ అటాక్ ముందు భారత టాపార్డర్ నిలవలేకపోయింది..
అయితే వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ రద్దు కావడంతో భారత బౌలింగ్ చూసే అవకాశం దక్కలేదు. అయితే నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి..
ముల్తాన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 104 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సగం ఓవర్లు కూడా ఆడించకుండా 23.4 ఓవర్లలోనే నేపాల్‌ని పెవిలియన్ చేర్చి, పాకిస్తాన్‌కి 238 పరుగుల తేడాతో భారీ విజయం అందించారు పాక్ బౌలర్లు..
ఇదే నేపాల్‌ని, టీమిండియాతో మ్యాచ్‌లో 48.2 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. మొదటి 5 ఓవర్లలో నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన 3 క్యాచులను భారత ఫీల్డర్లు జాడవిడిచారు. టీమిండియా టాప్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ నేపాల్ ఓపెనర్లు 10 ఓవర్లు బ్యాటింగ్ చేశారు..
తొలిసారి ఆసియా కప్ ఆడుతున్న నేపాల్‌పై టీమిండియా బౌలింగ్ ఇలా ఉందంటే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ వంటి వరల్డ్ క్లాస్ టీమ్స్‌పై ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు అభిమానులు.
స్టార్ బౌలర్లు లేరని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే బుమ్రా తప్ప మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా... ఇలా టీమిండియా మెయిన్ బౌలర్లందరినీ నేపాల్ బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొన్నారు.
India vs Ireland
2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై, 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై 10 వికెట్ల తేడాతో ఓడింది టీమిండియా. నేపాల్‌పై టీమిండియా బౌలింగ్ చూసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ ఇలాంటి పరాభవం ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు..
ఎలాగూ రెస్ట్, రెస్ట్ అంటూ టీమిండియా సీనియర్ ప్లేయర్లను చాలా మ్యాచులకు దూరం పెడుతూ వచ్చింది టీమిండియా. ఆసియా కప్‌లో కూడా బీ టీమ్‌ని ఆడించి ఉంటే, కనీసం సీనియర్లు లేరు, అందుకే ఇలా ఆడామని చెప్పుకోవడానికైనా ఉండేదని కామెంట్లు పెడుతున్నారు మరికొందరు..
Image credit: PTI
2023 వన్డే వరల్డ్ కప్‌కి ముందు ఇలాంటి పర్ఫామెన్స్‌తో టీమిండియా, తమపై ఉన్న అంచనాలను సగానికి సగం తగ్గించుకుంటోంది. నేపాల్‌పైనే ఇలా ఆడారంటే ఈ టీమ్ వరల్డ్ కప్ గెలవగలదనే నమ్మకం పెట్టుకోవడం, అత్యాశే అవుతుందని సగటు క్రికెట్ అభిమాని ఫిక్స్ అయిపోయాడు..