అశ్విన్‌కి మేం చెప్పింది ఒకటి, అతను అక్కడికెళ్లి చేసిందొకటి... టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది టీమిండియా. ఆఖరి ఓవర్‌లో హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ అవుట్ కావడంతో హై డ్రామా సాగగా ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, మ్యాజిక్ చేసి జట్టును గెలిపించాడు...
Ashwin-Virat Kohli
మహ్మద్ నవాజ్ వేసిన తొలి బంతిని వైడ్ బాల్‌గా వదిలేసి ఎక్స్‌ట్రా రూపంలో పరుగు రాబట్టిన రవిచంద్రన్ అశ్విన్, స్కోర్లు సమం కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి బంతిని ఫోర్‌గా మలిచి, టీమిండియాకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు...
‘దినేశ్ కార్తీక్ అవుట్ కాగానే అశ్విన్ బ్యాటింగ్‌కి పయనమయ్యాడు. మేం అతనికి చాలా విషయాలు చెప్పాం. టెన్షన్ తీసుకోవద్దని, కూల్‌గా ఉండాలని.. అయితే అతను అంతకంటే కూల్‌గా నేను ఇది చేయబోతున్నానని మాకే క్లారిటీ ఇచ్చాడు...
ashwin
రవి అశ్విన్‌కి తన రోల్‌పై, తన స్కిల్స్‌పై పూర్తి నమ్మకం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైడ్ బాల్‌గా బంతిని వదిలేయడం అనేది పూర్తిగా అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఆ పొజిషన్‌లో ఎవరున్నా బ్యాటుని తిప్పుతారు, ఎలాగైనా ఆ బాల్ ఆడాలని అనుకుంటారు...
అశ్విన్‌లో ఆ కంగారు లేదు. అది మమ్మల్ని కాపాడింది. మేం చాలా రోజులుగా టీమ్ కాంబినేషన్ గురించి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. ఏ ప్లేయర్లు ఏ పొజిషన్‌లో సెట్ అవుతారో, ఏ పొజిషన్‌లో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారో హోమ్‌వర్క్ చేస్తూనే ఉన్నాం...
Image credit: Getty
ఎలాంటి బౌలింగ్‌లో ఏ బ్యాటర్ ఇబ్బంది పడుతున్నారో తెలిస్తే... ప్రత్యర్థి బౌలింగ్‌ని బట్టి బ్యాటింగ్ పొజిషన్‌ని మార్చేందుకు అవకాశం ఉంటుంది. మేం చేస్తుంది కూడా అదే. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి ఇబ్బంది ఉంటే, అతని కంటే ముందు లెఫ్ట్ హ్యాండర్ అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కి వెళ్తాడు...
Image credit: PTI
యజ్వేంద్ర చాహాల్ కంటే రవిచంద్రన్ అశ్విన్‌కి అవకాశాలు దక్కడానికి కూడా ఇదే కారణం. అశ్విన్ బ్యాటుతో కూడా పరుగులు చేయగలడు. ఇదే పొజిషన్‌లో మరో స్పిన్నర్ ఉంటే అలా మ్యాచ్‌ని ఫినిష్ చేసేవాడా? ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే...