MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • రింకూ సింగ్ సిక్సర్ల వర్షం.. 45 బంతుల్లోనే సెంచరీ.. వారికి గట్టిగానే ఇచ్చిపడేశాడు

రింకూ సింగ్ సిక్సర్ల వర్షం.. 45 బంతుల్లోనే సెంచరీ.. వారికి గట్టిగానే ఇచ్చిపడేశాడు

Rinku Singh: రింకు సింగ్ యూపీ T20 లీగ్‌లో 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఆసియా కప్ 2025 జట్టులో తన ఎంపికపై వచ్చిన విమర్శలకు తన బ్యాట్ తో సమాధానం ఇచ్చాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 24 2025, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రింకు సింగ్ సునామీ ఇన్నింగ్స్
Image Credit : Getty

రింకు సింగ్ సునామీ ఇన్నింగ్స్

ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న యూపీ టీ20 లీగ్ లో టీమిండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు. లక్నో వేదికగా జరిగిన గోరఖ్‌పూర్ లయన్స్ - మీరట్ మావరిక్స్ మ్యాచ్‌లో మీరట్ జట్టు కెప్టెన్‌గా రింకూ సింగ్ ఆడాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో సిక్సర్ల వర్షం కురిపించాడు. 

కేవలం 45 బంతుల్లో సెంచరీ బాదాడు. తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇటీవల ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టులో రింకూ సింగ్ కు కూడా చోటుదక్కింది. అయితే, జట్టులోకి రింకూను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి.  తాజా సెంచరీతో అతను విమర్శలకు తగిన సమాధానం ఇచ్చాడు.

DID YOU
KNOW
?
ఐపీఎల్ లో వరుస సిక్సర్లు బాదిన రింకూ సింగ్
2023లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరమైనప్పుడు రింకూ సింగ్ వరుసగా 5 సిక్సులు కొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
45 బంతుల్లో సెంచరీ కొట్టిన రింకూ సింగ్
Image Credit : PTI

45 బంతుల్లో సెంచరీ కొట్టిన రింకూ సింగ్

ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రింకూ సింగ్ ఇన్నింగ్స్ లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. 

ఈ సూపర్ ఇన్నింగ్స్ తో మీరట్ జట్టు 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కాగా, గత ఎనిమిది టీ20 ఇన్నింగ్స్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోవడం వల్ల ఆసియా కప్ 2025 భారత జట్టులోకి రింకూ సింగ్ ను ఎంపిక చేయడం పై ప్రశ్నలు వస్తున్న సమయంలో సెంచరీ రావడం విశేషం.

35
రింకూ - యువరాజ్ భాగస్వామ్యం
Image Credit : PTI

రింకూ - యువరాజ్ భాగస్వామ్యం

ముందుగా బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు 20 ఓవర్లలో 167/9 పరుగులు చేసింది. 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త మెరుగైన ఆటను కొనసాగిస్తూ 167 పరుగులు చేసింది. 

లక్ష్యం చేధించడంలో మీరట్ జట్టు ఆరంభంలో కష్టాల్లో పడింది. త్వరగానే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ రింకూ సింగ్.. సాహబ్ యువరాజ్ తో కలిసి అద్భుత భాగస్వామ్యం అందించాడు. ఇద్దరూ కలిసి 65 బంతుల్లో 130 పరుగులు చేశారు. యువరాజ్ 22 బంతుల్లో 22 పరుగులు చేసి రింకూ కు సహకారం అందించాడు.

45
బ్యాట్ తో సమాధానమిచ్చిన రింకూ సింగ్
Image Credit : PTI

బ్యాట్ తో సమాధానమిచ్చిన రింకూ సింగ్

మీరట్ మావరిక్స్ జట్టు 18.5 ఓవర్లలో లక్ష్యం చేరుకుంది. రింకూ సింగ్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. సెంచరీతో అదరగొట్టిన రింకూ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. 

ఇటీవల ఆసియా కప్ జట్టులో చోటు దక్కిన రింకూ సింగ్ ఎంపికపై క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు విమర్శలు చేశారు. కానీ ఈ సెంచరీ ద్వారా ఆయన తన ఫామ్ తిరిగి అందుకున్నాడు. భారత జట్టులో తనకు చోటు ఇవ్వడం సరైన నిర్ణయమేనని ఈ ఇన్నింగ్స్ తో నిరూపించాడు.

55
ఆసియా కప్ 2025-భారత జట్టులో రింకూ
Image Credit : PTI

ఆసియా కప్ 2025-భారత జట్టులో రింకూ

ఆసియా కప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం ఇటీవల బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో రింకూ సింగ్ కు కూడా చోటుదక్కింది. అలాగే, శివం దూబే, హర్షిత్ రాణా లాంటి కొత్త పేర్లకు అవకాశం లభించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
ఛెతేశ్వర్‌ పుజారా రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణమేంటి?
Recommended image2
3 సెంచరీలు.. 431 పరుగులతో కంగారెత్తించారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved