తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... ఆస్ట్రేలియాకి స్వల్ప ఆధిక్యం... సుందర్, శార్దూల్ రికార్డుల మోత...

First Published Jan 17, 2021, 12:36 PM IST

గబ్బా టెస్టులో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు... వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ వీరోచిత బ్యాటింగ్ విన్యాసంతో మంచి స్కోరు సాధించగలిగింది. ఆరంగ్రేటం టెస్టు ఆడుతున్న సుందర్, 10 బంతుల మొదటి టెస్టు తర్వాత రీఎంట్రీ మ్యాచ్ ఆడుతున్న శార్దూల్ ఠాకూర్... ఆస్ట్రేలియా టాప్ క్లాస్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఏడో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి, ఆస్ట్రేలియా బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఫలితంగా భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆతిథ్య ఆస్ట్రేలియాకి 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. శార్దూల్ ఠాకూర్ 67 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 62 పరుగులు చేశాడు.