- Home
- Sports
- Cricket
- సురేష్ రైనా లేకపోతే సీఎస్‌కే పరిస్థితి ఇంతే... ఐపీఎల్ 2020 రిజల్ట్ రిపీట్ అవుతుందా...
సురేష్ రైనా లేకపోతే సీఎస్‌కే పరిస్థితి ఇంతే... ఐపీఎల్ 2020 రిజల్ట్ రిపీట్ అవుతుందా...
ఐపీఎల్ 2022 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మొదలెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే వరుసగా మొదటి మూడు మ్యాచుల్లో ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది చెన్నై సూపర్ కింగ్స్...

కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిన సీఎస్‌కే, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సేమ్ రిజల్ట్ రిపీట్ చేసింది...
210 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక లక్నో చేతుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులు ఎత్తేసింది...
సీజన్‌లో తొలిసారి టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ నయా సారథి రవీంద్ర జడేజా, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్‌ను 180 పరుగులకే నియంత్రించగలిగారు సీఎస్‌కే బౌలర్లు..
అయితే వరుస వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్, 18 ఓవర్లలో 126 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 2018 తర్వాత సీఎస్‌కే ఆలౌట్ కావడం ఇదే తొలిసారి...
వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంలో పడేసుకుంది. 10 ఫ్రాంఛైజీలు పాల్గొనే సీజన్ కావడంతో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచుల్లో నెగ్గాల్సి ఉంటుంది...
3 మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, మిగిలిన 11 మ్యాచుల్లో 8 మ్యాచుల్లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. దీంతో 2020 సీజన్ రిజల్ట్ రిపీట్ అవుతుందా? అని భయపడుతున్నారు చెన్నై ఫ్యాన్స్...
2008 నుంచి ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్ చేరుతూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారిగా 2020 సీజన్‌లో సురేష్ రైనా లేకుండా బరిలో దిగింది. సీజన్ ఆరంభానికి ముందు రైనా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చాడు.
2020 సీజన్‌లో 11 మ్యాచుల్లో 8 మ్యాచుల్లో ఓడిన సీఎస్‌కే, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఆఖరి 3 మ్యాచుల్లో గెలిచి పాయంట్ల పట్టికలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో సురేష్ రైనాని కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఇష్టపడలేదు. సీఎస్‌కేకి మూడు టైటిల్స్ అందించిన ‘చిన్నతలా’ని పక్కనబెట్టడం, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
2022 సీజన్‌లో ఎప్పుడూ లేనట్టుగా వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే, మొదటి మూడు మ్యాచుల్లో ఓడడం ఇదే తొలిసారి...
దీంతో సురేష్ రైనా లేకుండా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2022లో 2020 సీజన్ రిజల్ట్‌ను రిపీట్ చేస్తుందా... అని భయపడుతున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్..