- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ చరిత్రలో ఇద్దరే ఇద్దరు... ఎమ్మెస్ ధోనీ రికార్డును సమం చేసిన రాహుల్ తెవాటియా...
ఐపీఎల్ చరిత్రలో ఇద్దరే ఇద్దరు... ఎమ్మెస్ ధోనీ రికార్డును సమం చేసిన రాహుల్ తెవాటియా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే..

గుజరాత్ టైటాన్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి వచ్చింది. మొదటి బంతికే హార్ధిక్ పాండ్యా రనౌట్ కావడంతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించడం ఖాయమనుకున్నారంతా...
అయితే రెండో బంతికి సింగిల్ రావడం, మూడో బంతికి డేవిడ్ మిల్లర్ ఫోర్ బాదడంతో ఆఖరి 3 బంతుల్లో 13 పరుగులు కావాల్సి వచ్చింది.నాలుగో బంతికి ఓడియన్ స్మిత్ రనౌట్ కోసం ప్రయత్నించి, వికెట్లను మిస్ కావడతో ఓవర్ త్రో రూపంలో మరో పరుగు వచ్చింది...
Rahul Tewatia
ఆఖరి 2 బంతుల్లో విజయానికి 12 పరుగులు కావాల్సి రాగా... రాహుల్ తెవాటియా వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు.. ఆఖరి 2 బంతుల్లో 2 సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు రాహుల్ తెవాటియా...
ఇంతకుముందు 2016లో పంజాబ్ కింగ్స్‌పైనే ఎమ్మెస్ ధోనీ ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత 2020లో కేకేఆర్‌పై రవీంద్ర జడేజా ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు...
పంజాబ్ కింగ్స్‌పై ఆఖరి 2 బంతుల్లో 2 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు రాహుల్ తెవాటియా. ఆఖరి బంతికి సిక్సర్ బాది, మ్యాచ్‌ని ముగించిన 9వ ప్లేయర్‌గా నిలిచాడు తెవాటియా...
ఇంతకుముందు రోహిత్ శర్మ మూడు సార్లు ఈ ఫీట్ సాధించగా అంబటి రాయుడు, సౌరబ్ తివారి, డ్వేన్ బ్రావో, ఎమ్మెస్ ధోనీ, మిచెల్ సాంట్నర్, నికోలస్ పూరన్,రవీంద్ర జడేజా, కెఎస్ భరత్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ని ముగించారు...
ఈ విజయంతో ఆరంగ్రేట సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో హ్యాట్రిక్ కొట్టింది గుజరాత్ టైటాన్స్... ఐపీఎల్ చరిత్రలో ఆరంగ్రేటంలోనే మొదటి మూడు మ్యాచుల్లో విజయాలు అందుకున్న మూడో జట్టు గుజరాత్ టైటాన్స్. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ 2008 సీజన్‌లో, గుజరాత్ లయన్స్ 2016 సీజన్‌లో ఈ ఫీట్ సాధించాయి.
Shubman Gill
ఐపీఎల్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో 80+ స్కోరు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్ ఈ ఫీట్ సాధించారు...