- Home
- Sports
- Cricket
- ఆ నాలుగు జట్లకి ఈజీ! మిగిలిన మూడింటికీ తేలికే! ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్స్ చేరేందుకు...
ఆ నాలుగు జట్లకి ఈజీ! మిగిలిన మూడింటికీ తేలికే! ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్స్ చేరేందుకు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే 29 మ్యాచులు ముగిసాయి. 74 మ్యాచుల సుదీర్ఘ సీజన్ అయినప్పటికీ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరే జట్ల గురించి ఓ అంచనా, క్లారిటీ వచ్చేసింది అభిమానులకు... ఏ జట్టుకి ప్లేఆఫ్స్ చేరే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయంటే...

సీఎస్‌కేతో మ్యాచ్‌లో గెలిచి, 6 మ్యాచుల్లో 5 విజయాలతో 10 పాయింట్లతో టాప్‌లో నిలిచింది గుజరాత్ టైటాన్స్. గుజరాత్ మిగిలిన 8 మ్యాచుల్లో 3 గెలిస్తే మిగిలిన లెక్కలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. కనీసం 2 మ్యాచులు గెలిచినా, నెట్‌రన్ రేట్ ద్వారా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది...
6 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, మిగిలిన 8 మ్యాచుల్లో 4 మ్యాచులు గెలిస్తే, 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 6 మ్యాచుల్లో 4 విజయాల సాధించి 8 పాయింట్లతో ఉంది. ఆర్‌సీబీ మిగిలిన 8 మ్యాచుల్లో 4 గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది...
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడినా ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు అందుకుని, ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆరెంజ్ ఆర్మీ మరో 4 మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది...
రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుంది. మిగిలిన 9 మ్యాచుల్లో 5 గెలిస్తే, మూడు సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్ చేరుకుంటుంది రాయల్స్...
గత సీజన్ రన్నరప్ కేకేఆర్, ఆరు మ్యాచుల్లో 3 విజయాలు అందుకోగలిగింది. ప్లేఆఫ్స్ చేయాలంటే శ్రేయాస్ అయ్యర్ టీమ్ మిగిలిన 8 మ్యాచుల్లో 5 విజయాలు అందుకోవాల్సి ఉంటుంది...
మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ కూడా 6 మ్యాచుల్లో 3 గెలిచింది. 8 సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్ చేరాలంటే పంజాబ్, 8 మ్యాచుల్లో 5 గెలవాల్సి ఉంటుంది...
ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే అందుకోగలిగింది. రిషబ్ పంత్ టీమ్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే మిగిలిన 9 మ్యాచుల్లో 6 విజయాలు అందుకోవాల్సి ఉంటుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 6 మ్యాచులు ఆడి అందులో ఒకే ఒక్క విజయం దక్కింది. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కి చేరాలంటే మిగిలిన 8 మ్యాచుల్లో 7 విజయాలు అందుకోవాల్సి ఉంటుంది...
ఫైవ్ టైమ్ టైటిల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఆరు మ్యాచుల్లో ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 8 మ్యాచుల్లో అన్నీ గెలవాల్సిందే. కనీసం 7 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంటే నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది...