- Home
- Sports
- Cricket
- జస్ప్రిత్ బుమ్రాని ఇంకా బాగా వాడొచ్చు... రోహిత్ శర్మ కెప్టెన్సీపై రవిశాస్త్రి అసంతృప్తి...
జస్ప్రిత్ బుమ్రాని ఇంకా బాగా వాడొచ్చు... రోహిత్ శర్మ కెప్టెన్సీపై రవిశాస్త్రి అసంతృప్తి...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది. ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్, హ్యాట్రిక్ పరాజయాలను ఎదుర్కొని ఒక్క విజయం కోసం ఎదురుచూస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

ట్రెంట్ బౌల్ట్‌ని వేలానికి వదిలేసిన ముంబై ఇండియన్స్, జస్ప్రిత్ బుమ్రాతో బంతిని షేర్ చేసుకునే మరో స్టార్ బౌలర్ లేక ఇబ్బంది పడుతోంది... తైమల్ మిల్స్ వికెట్లు తీస్తున్నా విజయాన్ని మాత్రం అందించలేకపోతున్నాడు..
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేక 16 ఓవర్లలో చిత్తుగా ఓడింది...
Jasprit Bumrah
‘జస్ప్రిత్ బుమ్రాని ఇంకా బాగా వాడొచ్చని నా అభిప్రాయం. ఈ సీజన్‌లో బుమ్రా బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌లో బౌలింగ్ డెప్త్ లేదు...
చేసిన స్కోరు తక్కువైనప్పుడు వికెట్ల కోసం చూడకుండా డెత్ ఓవర్ల కోసం బుమ్రాని అట్టిపెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఈజీగా పరుగులు ఇస్తున్నప్పుడు బుమ్రా అయినా, ఏ బౌలర్ అయినా పెద్దగా తేడా ఉండదు...
బ్యాటర్ ఊపు మీద ఉన్నప్పుడు ఏ బౌలర్ అయినా ఏమీ చేయలేడు. డానియల్ సామ్స్‌దీ అదే పరిస్థితి. అయితే బుమ్రాని కరెక్టుగా వాడితే మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారేది...
ఆఖరి ఓవర్లలో రస్సెల్ వస్తాడని బుమ్రా ఓవర్‌ను ఆపడం కరెక్ట్ కాదు. రస్సెల్ కంటే ముందే మ్యాచ్ ముగిసిపోతే, బుమ్రా లాంటి బౌలర్‌ను సరిగా వాడనట్టే కదా...
Mumbai Indians
జస్ప్రిత్ బుమ్రాని ఎలా వాడాలో కెప్టెన్ రోహిత్ శర్మకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీజన్‌లో రోహిత్ కాస్త ప్రెషర్‌లో కనిపిస్తున్నాడు... అందుకే మ్యాచ్ ఆఖరి ఓవర్‌దాకా వెళ్తుందని భావించి ఉంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
Daniel Sams
కేకేఆర్ విజయానికి 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సిన దశలో డానియల్ సామ్స్ వేసిన 16వ ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు రాబట్టిన ప్యాట్ కమ్మిన్స్ మ్యాచ్‌ని ముగించాడు...
డానియల్ సామ్స్ బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు ప్యాట్ కమ్మిన్స్. నో బాల్ రూపంలో మరో 2 పరుగులు అదనంగా రావడంతో మ్యాచ్‌లో 16 ఓవర్లలోనే ముగిసింది...