- Home
- Sports
- Cricket
- లక్నో విజయాల వెనక మెంటర్ గౌతమ్ గంభీర్... కెప్టెన్సీ రాని కెఎల్ రాహుల్‌ని అలా గైడ్ చేస్తూ...
లక్నో విజయాల వెనక మెంటర్ గౌతమ్ గంభీర్... కెప్టెన్సీ రాని కెఎల్ రాహుల్‌ని అలా గైడ్ చేస్తూ...
కెఎల్ రాహుల్... మంచి బ్యాట్స్‌మెన్, అయితే కెప్టెన్సీ విషయంలో మాత్రం జీరో. జట్టును నడిపించే విషయంలో కెఎల్ రాహుల్‌కి పాస్ మార్కులు కూడా పడవు. అలాంటి కెఎల్ రాహుల్ కెప్టెన్సీ లక్నో సూపర్ జెయింట్స్ వరుస విజయాలు అందుకోవడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు...

Gautam Gambhir
ఐపీఎల్ 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఏరికోరి ప్లేయర్లను కొనుగోలు చేసింది. లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ పక్క ప్రణాళిక ప్రకారం కావాలనుకున్న ప్లేయర్ల కోసం ఎంత చెల్లించడానికైనా సిద్ధపడ్డాడు...
Avesh Khan
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున గత ఐపీఎల్‌లో 28 వికెట్లు తీసిన ఆవేశ్ ఖాన్‌ని రూ.10 కోట్లు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. అంతర్జాతీయ అనుభవం కూడా ఆవేశ్ ఖాన్‌కి ఇంత చెల్లించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
అలాగే దీపక్ హుడా, జాసన్ హోల్డర్, క్వింటన్ డి కాక్ వంటి కీ ప్లేయర్లను మెగా వేలంలో కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...
సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను రిటైన్ చేసుకున్న లక్నో... మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడినా, ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో కమ్‌బ్యాక్ ఇచ్చింది...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి తొలి విజయాన్ని అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 169 పరుగులే చేసినా ఆ స్కోరును కాపాడుకుంటూ రెండో విజయం అందుకుంది...
దుస్మంత ఛమీరా వంటి ప్లేయర్‌ను ఎలా వాడుకోవాలో కూడా కెఎల్ రాహుల్‌కి తెలియడం లేదు. అయితే వెనకుండి కథను నడిపిస్తున్న గౌతమ్ గంభీర్, ఎప్పటికప్పుడూ సలహాలు, సూచనలతో జట్టు విజయాలవైపు నడిపిస్తున్నాడు.
సీఎస్‌కేపై తొలి విజయం తర్వాత మెంటర్ గౌతమ్ గంభీర్, డగౌట్‌లో అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. ఒక్క విజయానికే గౌతీ ఇంత ఓవర్‌గా స్పందించడంపై ఫ్యాన్స్ షాక్ అయ్యారు...
అయితే మెంటర్‌గా అందుకున్న తొలి విజయం కావడంతో గౌతమ్ గంభీర్ అలా రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్‌గా పనికి రాడని, టైటిల్ గెలిచే సత్తా లేదని విమర్శలు ఎదుర్కొన్న టీమ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించి అందుకున్న విజయం కావడంతో గౌతీ కాస్త ఓవర్‌గానే ఎమోషనల్ అయ్యాడని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..