- Home
- Sports
- Cricket
- టీమిండియాలోకి దినేశ్ కార్తీక్? ఇంత హెవీ కాంపిటీషన్‌లో కార్తీక్‌ని ఆడించడం సాధ్యమేనా...
టీమిండియాలోకి దినేశ్ కార్తీక్? ఇంత హెవీ కాంపిటీషన్‌లో కార్తీక్‌ని ఆడించడం సాధ్యమేనా...
దినేశ్ కార్తీక్... ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న భారత సీనియర్ వికెట్ కీపింగ్ బ్యాటర్. భారత మాజీ సారథి ఎమ్మెస్ ధోనీ ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే టీమిండియాలోకి వచ్చిన దినేశ్ కార్తీక్... మాహీ డామినేషన్ కారణంగా సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 6 మ్యాచులు ఆడి 197 సగటుతో 197 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, 209+ స్ట్రైయిక్ రేటుతో ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు...
ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత సరైన ఫినిషర్ కోసం వెతుకుతున్న టీమిండియాకి దినేశ్ కార్తీక్ సరైన ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు...
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, క్రికెట్ విశ్లేషకులు కూడా దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే భారత జట్టులో చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు...
అయితే 37 ఏళ్ల దినేశ్ కార్తీక్, భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం వీలయ్యే పనేనా. ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఎవరి ప్లేస్‌లో ఆడించాలి? ఏ స్థానంలో ఆడించాలి?...
భారత జట్టు ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ దాదాపు కన్ఫార్మ్ అయిపోయినట్టే. ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తే ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్‌లను రిజర్వు ఓపెనర్లుగా వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయవచ్చు...
అలాగే వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, టూ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆడడం ఖాయం. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్‌కి వస్తాడు. పంత్ గత ఏడాదిన్నరగా చూపిస్తున్న పర్ఫామెన్స్ కారణంగా అతన్ని పక్కనబెట్టే సాహసం సెలక్టర్లు చేయకపోవచ్చు...
రిషబ్ పంత్ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వస్తాడు. హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ 2022 సీజన్‌లో చూపిస్తున్న పర్ఫామెన్స్, అతనికి టీమ్‌లో ప్లేస్ రీకన్ఫార్మ్ చేసేసింది. మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కి రిజర్వు ప్లేయర్‌గా చోటు దక్కొచ్చు...
హార్ధిక్ పాండ్యా కంటే ముందు, లేదా ఆ తర్వాత స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా క్రీజులోకి వస్తాడు. జడ్డూ, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫెయిలైనా అతని ట్రాక్ రికార్డు కారణంగా జట్టులోకి రావడం ఖాయం...
ఇక ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్ ఇద్దరూ మూడో ఫాస్ట్ బౌలింగ్ చోటు కోసం పోటీపడుతున్నారు. గాయపడిన దీపక్ చాహార్ ఆ సమయానికల్లా కోలుకోకపోతే హర్షల్ పటేల్‌కి చోటు దక్కొచ్చు...
ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, స్పిన్నర్లుగా యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లు పోటీపడుతున్నారు...
ఇప్పుడు టీమిండియాలో ఉన్న పోటీ చూస్తే దినేశ్ కార్తీక్, టీమ్‌లోకి రావాలంటే రిషబ్ పంత్ గాయపడి, టోర్నీకి దూరం కావాలి. లేదా దినేశ్ కార్తీక్ కచ్ఛితంగా ఉండాల్సిందేనని టీమ్ మేనేజ్‌మెంట్ భావించాల్సి ఉంటుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
2019 వన్డే వరల్డ్‌కప్‌లో ముగ్గురు వికెట్ కీపర్లతో (ఎమ్మెస్ ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్) బరిలో దిగింది భారత జట్టు. అయితే ఈ ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదు. ముగ్గురూ కూడా ముకుమ్మడిగా ఫెయిల్ కావడంతో టీమిండియా సెమీస్ నుంచే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.