- Home
- Sports
- Cricket
- T20 World Cup: వరల్డ్ కప్ హీరోలు వీళ్లే.. ఆ ఒక్కటి తప్ప భూతద్దం వేసినా దొరకని టీమిండియా ఆటగాళ్లు..
T20 World Cup: వరల్డ్ కప్ హీరోలు వీళ్లే.. ఆ ఒక్కటి తప్ప భూతద్దం వేసినా దొరకని టీమిండియా ఆటగాళ్లు..
T20 World Cup Stats: యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా చేజిక్కించుకున్నది. భారీ అంచనాలతో దిగిన న్యూజిలాండ్ మళ్లీ ఫైనల్ మెట్టుపై చతికిలపడింది. నిన్న ముగిసిన ఈ టోర్నీలో ఉత్తమ ప్రదర్శనలు ఎలా ఉన్నాయంటే..

దాదాపు నెల రోజులుగా ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన పొట్టి క్రికెట్ సంగ్రామం ముగిసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఫైనల్ చేరాయి. ఆసీస్ తొలి టీ20 ప్రపంచకప్ ను నెగ్గారు. న్యూజిలాండ్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. అయితే ఇన్ని రోజుల పాటు అభిమానులను అలరించిన ఈ మెగా ఈవెంట్ లో వివిధ విభాగాలలో విజేతలు ఎవరో ఇక్కడ చూద్దాం.
అత్యధిక పరుగులు : టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ ప్రపంచకప్ లో హయ్యస్ట్ రన్స్ సాధించిన వీరుడు. ఆరు ఇన్నింగ్స్ లలో అతడు 303 పరుగులు చేశాడు. ఆ తర్వాత జాబితాలో డేవిడ్ వార్నర్ (289), మహ్మద్ రిజ్వాన్ (281), జోస్ బట్లర్ (269) ఉన్నారు. అయితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ మాత్రం అత్యధిక పరుగులు చేసిన బాబర్ కు కాకుండా వార్నర్ కు దక్కడం గమనార్హం.
అత్యధిక వికెట్లు : క్వాలిఫయింగ్ స్టేజ్ నుంచి గ్రూప్ దశకు చేరిన శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ ఈ టోర్నీలో 16 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత జాబితాలో ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా (13), ట్రెంట్ బౌల్ట్ (13), షకిబ్ ఉల్ హసన్ (11) ఉన్నారు.
సెంచరీలు : ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఒక్కడే ఈ టోర్నీలో సెంచరీ చేశాడు. షార్జాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బట్లర్.. సెంచరీ బాదాడు. ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (101) కూడా బట్లర్ దే.
హాఫ్ సెంచరీలు : ఈ టోర్నీలో పాక్ సారథి బాబర్ ఆజమ్ 4 హాఫ్ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత జాబితాలో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ (3) ఉండటం గమనార్హం. మరో పాక్ ఆటగాడు రిజ్వాన్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా మూడు అర్థ శతకాలు సాధించారు.
ఐదు వికెట్ల వీరులు : బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐదు వికెట్లు తీశాడు. దాంతో పాటు ఈ సిరీస్ లో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా (5-19) కూడా అతడి పేరు మీదే ఉంది. ముజీర్ రెహ్మాన్ (అఫ్గానిస్థాన్) కూడా ఓ మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు.
అత్యధిక క్యాచ్ లు : స్కాట్లాండ్ కు చెందిన స్కాట్ మాక్లాడ్.. 8 క్యాచ్ లు పట్టి అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా ఉన్నాడు. ఆ తర్వాత జాబితాలో స్టీవ్ స్మిత్ (ఆసీస్-8), మహ్మద్ నయీం (బంగ్లాదేశ్-6), జార్జ్ మున్సీ (స్కాట్లాండ్-6) ఉన్నారు.
అత్యధిక జట్టు స్కోరు : ఇండియా-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ వీరబాదుడు బాదింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ, రాహుల్ వీర విహారంతో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టోర్నీలో ఇదే హయ్యస్ట్ టీమ్ టోటల్.
అత్యధిక భాగస్వామ్యం : చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్-మహ్మద్ రిజ్వాన్ నెలకొల్పారు. 152 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఈ జంట.. వికెట్ కూడా కోల్పోకుండా పని పూర్తి చేసింది.
అత్యధిక సిక్సర్లు : ఈ టోర్నీలో జోస్ బట్లర్ 13 సిక్సర్లు కొట్టి ప్రథమ స్థానంలో ఉండగా.. తర్వాత మహ్మద్ రిజ్వాన్ (12), డేవిడ్ వీస్ (11), డేవిడ్ వార్నర్ (11) ఉన్నారు.
डेविड वॉर्नर
అత్యధిక ఫోర్లు : ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 7 ఇన్నింగ్స్ లలో 32 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ (6 ఇన్నింగ్సులలో 28), మహ్మద్ రిజ్వాన్ (6 ఇన్నింగ్సులలో 23) ఉన్నారు.