MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్... టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌‌పై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ బెట్టింగ్...

కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్... టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌‌పై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ బెట్టింగ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కథ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఆదివారం నవంబర్ 14న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఈ పొట్టి ప్రపంచకప్ కొత్త విజేత ఎవరో తేలిపోనుంది... ఈ మ్యాచ్‌పై ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 13 2021, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఆటతోనే కాదు, వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలిచింది... ముఖ్యంగా డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం హాట్ టాపిక్ అయ్యింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌కి ఐపీఎల్ టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ని కాదని, 2018 సీజన్‌లో టీమ్‌ను ఫైనల్ చేర్చిన కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ అప్పగించింది. ఆరు మ్యాచులు పూర్తయిన తర్వాత జరిగిన ఈ మార్పు, జట్టు పర్ఫామెన్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది...

311

అయితే టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలను పట్టించుకోకుండా సోషల్ మీడియాలో కేన్ మామపై ప్రేమను బహిరంగంగానే వ్యక్తం చేశాడు డేవిడ్ వార్నర్ భాయ్...

411

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తలబడేది న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి అది కేన్ మామ వర్సెస్ వార్నర్ భాయ్ మ్యాచ్...

511

ఐపీఎల్ 2022 సీజన్‌కి మెగా వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో ఏ జట్టుకైనా ఇద్దరు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వార్నర్ భాయ్‌ని వదిలేయనుందని టాక్ నడుస్తోంది...

611

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ని అట్టిపెట్టుకుని మిగిలిన ప్లేయర్లను వేలానికి విడుదల చేయబోతున్నట్టు ప్రచారం నడుస్తోంది...

711

డేవిడ్ వార్నర్ కూడా సన్‌రైజర్స్ హైదరాబద్‌తో తన అనుబంధం ముగిసిందని, కొత్తగా ప్రయాణం మొదలెట్టాల్సిన సమయం వచ్చేసిందని తెలిపాడు. వచ్చే సీజన్‌లో వార్నర్ దాదాపు వేరే జట్టుకి ఆడడం ఖాయంగా మారింది...

811

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయినా సూపర్ 12 రౌండ్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించి, ఆస్ట్రేలియా ఫైనల్ దాకా రావడానికి కారణమయ్యాడు...

911

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 49 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా పెవిలియన్ చేరాడు. వార్నర్ భాయ్ బ్యాటుకి బాల్ తగలకపోయినా, అంపైర్ అవుట్ ఇవ్వగానే రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్ చేరాడు...

1011

వార్నర్ భాయ్ పర్ఫామెన్స్‌తో ఫుల్లు హ్యాపీగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్, ఈ సారి ఆయన్ని రిటైన్ చేసుకోవాలంటూ ఆరెంజ్ ఆర్మీకి మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెడుతున్నారు...

1111

ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వారిని రిటైన్ చేసుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఓ కొత్త పోటీని సోషల్ మీడియాలో మొదలెట్టారు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియా గెలిస్తే వార్నర్ భాయ్‌ని రిటైన్ చేసుకోవాలని, న్యూజిలాండ్ గెలిస్తే కేన్ మామను రిటైన్ చేసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved