సూర్య భాయ్... ఇట్స్ ఏ బ్రాండ్! ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా బ్యాటర్...
సూర్యకుమార్ యాదవ్, టీమిండియాలోకి వచ్చి ఏడాది మాత్రమే అయ్యింది. ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా లేటుగా సెలక్టర్ల దృష్టిలో పడిన సూర్యకుమార్ యాదవ్, 2021 మార్చిలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. 2022లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో దూసుకుపోతున్న సూర్య, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు...
Image credit: Getty
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు చేసి అవుటైన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత నెదర్లాండ్స్, సౌతాఫ్రికాలతో జరిగిన మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో మెరిశాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో 134 పరుగులు చేసిన సూర్య, టీమిండియా తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...
ఇదే సమయంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రిజ్వాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ పర్ఫామెన్స్‌తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రిజ్వాన్‌ని అధిగమించి టాప్‌కి దూసుకెళ్లాడు సూర్యకుమార్ యాదవ్...
Virat Kohli-Suryakumar Yadav
ఈ ఏడాది టీ20ల్లో రికార్డు స్థాయిలో 8 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్.. వెయ్యి పరుగులకు అతి చేరువలో ఉన్నాడు. 863 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో ఉంటే, మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ డివాన్ కాన్వే, 3వ ర్యాంకులో ఉండగా బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు...
సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్, అప్పుడే టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ని దక్కించుకున్నాడు. అయితే మూడో మ్యాచ్‌లో ఫెయిల్ కావడంతో రెండు రోజుల్లోనే సూర్య టాప్ ప్లేస్ చేజారింది. మళ్లీ నెల రోజులకు టాప్ కుర్చీని అధిరోహించాడు సూర్యకుమార్ యాదవ్..
పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేసి, టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ... టాప్ 10 ర్యాంకింగ్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రోహిత్ శర్మ మరో స్థానం దిగజారి 15వ స్థానంలో సెటిల్ అయ్యాడు...