ఫెయిల్ అయినా సరే, వాళ్లే కావాలి! రాహుల్, దినేశ్ కార్తీక్‌లకు మరో ఛాన్స్... రిషబ్ పంత్, చాహాల్‌లకు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఘోరంగా ఫెయిల్ అయిన టీమిండియా, బౌలింగ్‌లో కాస్తో కూస్తో రాణించి చివరి ఓవర్ వరకూ పోరాడింది. అయితే ఈ పరాజయం తర్వాత కూడా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పెద్దగా మార్పులు లేకుండా బరిలో దిగింది టీమిండియా...
KL Rahul
మొదటి మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన కెఎల్ రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి మరో అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో డకౌట్ అయిన దీపక్ హుడా ప్లేస్‌లో అక్షర్ పటేల్‌ని తిరిగి తుదిజట్టులోకి తీసుకుంది...
Image credit: Getty
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో దినేశ్ కార్తీక్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఇన్నింగ్స్ మధ్యలోనే ఫిజియో పర్యవేక్షణలో పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఆడడం కష్టమేనని, రిషబ్ పంత్ తుదిజట్టులోకి వస్తాడని ప్రచారం జరిగింది...
Image credit: Getty
దినేశ్ కార్తీక్‌కి ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేదు. 37 ఏళ్ల వయసులో దినేశ్ కార్తీక్‌ని టీ20 వరల్డ్ కప్ ఆడించడం అనవసరమంటూ భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు కూడా . అయినా అతనికి మరో ఛాన్స్ ఇచ్చింది భారత జట్టు...
అలాగే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు. అయినా అతనికి తుది జట్టులో అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, భారత ప్రధాన టీ20 ఫార్మాట్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది...
KL Rahul
చూస్తుంటే ప్లేయర్ల పర్ఫామెన్స్ ఎలా ఉన్నా, ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసేందుకు రోహిత్ శర్మ కానీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అందుకే రిషబ్ పంత్ రూపంలో మ్యాచ్ విన్నర్ అందుబాటులో ఉన్నా, అతను రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...