గాయంతో బాధపడుతున్న రిషబ్ పంత్! టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి మరో షాక్ తప్పదా..
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో సూపర్ 12 రౌండ్ నుంచే నిష్కమించింది భారత జట్టు. టైటిల్ ఫెవరెట్‌గా టోర్నీని ప్రారంభించిన టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి సెమీస్ చేరలేకపోయింది. అయితే ఈసారి భారత జట్టుపై అంచనాలు అంతగా లేవు. కారణం కీలక ప్లేయర్లు గాయాలతో ఈ మెగా టోర్నీకి దూరం కావడమే..
Image credit: Getty
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. అంతకుముందు ఆసియా కప్ 2022 టోర్నీలో గాయపడిన రవీంద్ర జడేజా.. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని వరల్డ్ కప్ ఆడడం లేదు...
Image credit: PTI
స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన ఆల్‌రౌండర్ దీపక్ చాహార్ కూడా వెన్ను నొప్పితో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్‌కి దూరమయ్యాడు. ముగ్గురు ప్లేయర్లు దూరం కావడంతో టీమిండియాపై అంచనాలు భారీగా తగ్గిపోయాయి...
తాజాగా ఈ లిస్టులో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా చేరిపోయినట్టు టాక్ వినబడుతోంది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న రిషబ్ పంత్, వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లోనూ పాల్గొన్నాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచుల్లో రిషబ్ పంత్ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...
Sanju Samson and Rishabh Pant
తుది జట్టులో లేని మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహాల్ కూడా ఈ వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేశారు. అయితే రిషబ్ పంత్ మాత్రం పూర్తిగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. డగౌట్‌లో కూర్చున్న రిషబ్ పంత్ మోకాలికి బ్యాండేజీతో కనిపించాడు. దీంతో అభిమానుల్లో సందేహాలు వినిపిస్తున్నాయి...
Rishabh Pant-Rohit Sharma
ఇప్పటికే గాయలతో ముగ్గురు ప్లేయర్లు దూరం చేసుకున్న టీమిండియాకి, రిషబ్ పంత్ రూపంలో మరో మ్యాచ్ విన్నర్‌ని కోల్పోతే.. కష్టాలు రెట్టింపు అవుతాయి. రిషబ్ పంత్ గాయపడితే అతని స్థానంలో సంజూ శాంసన్‌కి చోటు దక్కుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు అభిమానులు..