MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రికార్డులు ఎవ్వరైనా కొడతారు! నా రికార్డును నువ్వు బ్రేక్ చేయడం... కోహ్లీకి మహేళ జయవర్థనే ప్రశంస..

రికార్డులు ఎవ్వరైనా కొడతారు! నా రికార్డును నువ్వు బ్రేక్ చేయడం... కోహ్లీకి మహేళ జయవర్థనే ప్రశంస..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సూపర్ ఫామ్‌లో చెలరేగిపోతున్నాడు విరాట్ కోహ్లీ. మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 220 పరుగులు చేసిన విరాట్, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ... కొన్ని రికార్డులను బ్రేక్ చేసేశాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Nov 03 2022, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మహేళ జయవర్థనే రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్థనే 31 ఇన్నింగ్స్‌ల్లో 1016 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1065 పరుగులు చేసి... టాప్‌లో నిలిచాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘రికార్డులు అనేవి ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ అవ్వాల్సిందే. ఎవరో ఒకరు నా రికార్డును బ్రేక్ చేస్తారని తెలుసు. అయితే అది విరాట్ కోహ్లీ అవ్వడం చాలా సంతోషాన్ని కలిగించింది. విరాట్... బ్రిలియెంట్ మేట్. కంగ్రాట్స్... నువ్వు ఎప్పటికీ వారియర్‌వే... 

36
Image credit: Getty

Image credit: Getty

ఫామ్‌ ఈజ్ టెంపరీరీ, క్లాస్ ఈజ్ పర్మినెంట్... వెల్ డన్ విరాట్...’ అంటూ వ్యాఖ్యానించాడు శ్రీలంక మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ హెడ్ కోచ్ మహేళ జయవర్థనే...

46
virat

virat

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకి 184 పరుగుల భారీ స్కోరు అందించిన విరాట్ కోహ్లీ, ఈ ఎడిషన్‌లో రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. మొత్తంగా ఐసీసీ వరల్డ్ కప్‌ చరిత్రలో విరాట్‌కి ఇది 10వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అత్యధిక సార్లు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు కోహ్లీ...

56
Image credit: Getty

Image credit: Getty

మొత్తంగా విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 60వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచుల్లో 76 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిస్తే, విరాట్ కోహ్లీ 477 మ్యాచుల్లో 60 సార్లు ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. సనత్ జయసూర్య 58, జాక్వస్ కలీస్ 57 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచి సచిన్, కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.. 

66

అంతేకాకుండా ఆస్ట్రేలియాలో 3350 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గానూ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియాలో 3300 పరుగులు చేస్తే, శ్రీలంకలో 2686 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఈ రికార్డులను తిరగరాశాడు...
 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Recommended image2
IPL 2026 Records: ఐపీఎల్ 2026లో రికార్డుల సునామీ.. 27 వేలకు పైగా రన్స్, 1426 సిక్సర్లు
Recommended image3
IPL 2026 Purple Cap Winner: రబాడ చేతికి పర్పుల్ క్యాప్.. హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved