అంచనాలు లేకుండా వస్తారు! అదరగొడుతూ ఫైనల్‌కి వెళ్తారు... కేన్ మామ నీ కెప్టెన్సీ సీక్రెట్ ఏంటయ్యా...
టీమిండియా ద్వైపాక్షిక సిరీసుల్లో ప్రత్యర్థులపై పెద్దపులిలా దాడి చేస్తుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అనే తేడా లేకుండా చీల్చి చెండాడేస్తుంది. ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చేసరికి పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. అదే న్యూజిలాండ్ విషయానికి వస్తే.. ద్వైపాక్షిక సిరీసుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఉండదు కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఇరగదీస్తుంది...
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలోనూ న్యూజిలాండ్ పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగింది. ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో కూడా పాక్ చేతుల్లో చిత్తుగా ఓడింది న్యూజిలాండ్...
అయితే ఆరంభ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది న్యూజిలాండ్. ఆతిథ్య ఆసీస్‌పై 89 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్, +4.450 నెట్ రన్ రేట్‌తో టాప్‌లో ఉంది. మిగిలిన మ్యాచుల్లో మరీ పేలవ ప్రదర్శన ఇస్తే తప్ప... సెమీస్ చేరడానికి మిగిలిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో విజయం అందుకుంటే సరిపోతుంది కివీస్‌కి...
Rohit Sharma-Kane Williamson
2015 వన్డే వరల్డ్ కప్ నుంచి ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోంది. 2016 టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్, 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లింది.. 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఫైనల్ చేరిన న్యూజిలాండ్... ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించింది...
కెప్టెన్ కూల్ కేన్ విలియంసన్ సారథ్యంలో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 టైటిల్ గెలిచిన న్యూజిలాండ్, మిగిలిన టోర్నీల్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. టైటిల్ గెలవలేకపోయినా 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో, 2021టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాతో తలబడింది కివీస్..
మూడు ఫైనల్స్‌లో మూడు భిన్నమైన జట్లతో పోటీపడిందంటే న్యూజిలాండ్, మిగిలిన జట్ల కంటే మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చినట్టే లెక్క. ఈసారి కూడా కేన్ మామ కెప్టెన్సీలోని న్యూజిలాండ్‌పై పెద్దగా అంచనాలు లేవు. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత వారి ట్రాక్ రికార్డు కూడా బాలేదు.
అయితే తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చి, తాము ‘అండర్ డాగ్స్’ కాదని ఘనంగా చాటి చెప్పింది న్యూజిలాండ్. గత 16 మ్యాచుల్లో ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్‌కి దక్కిన తొలి విజయం ఇదే. 16 మ్యాచుల్లో 14 పరాజయాలు అందుకున్న న్యూజిలాండ్, ఓ టెస్టును డ్రాగా ముగించుకోగలిగింది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 ఓపెనర్ మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియంసన్ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. టాస్ ఓడిన తర్వాత కూడా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాని ఓడించిందంటే అది కచ్ఛితంగా టీమ్ వర్క్ మహిమే...
గ్రూప్ 1లో ఉన్న న్యూజిలాండ్ తర్వాతి మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో మ్యాచులు ఆడాల్సి ఉంది. మరి కేన్ మామ మ్యాజిక్ మరోసారి వర్కవుట్ అవుతుందా? పెద్దగా అంచనాలు లేని కివీస్, ఫైనల్ చేరుతుందా? తేలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే...