ఓడిపోతే పాక్ ఇంటికి! పోనీ ఎలాగోలా గెలుద్దామంటే సెమీస్‌లో కివీస్ గండం... టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి...
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సీన్స్, 2019 వన్డే వరల్డ్ కప్‌నే తలపిస్తున్నాయి. ఆ టోర్నీలో పాకిస్తాన్ జట్టు, సెమీస్ చేరేందుకు టీమిండియాపైనే ఆధారపడింది. ఇప్పుడు కూడా వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్... సెమీస్ ఆశలు సజీవంగా నిలబెట్టుకునేందుకు టీమిండియావైపే చూస్తోంది...
India vs South Africa
2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా చేతుల్లో ఓడిన పాకిస్తాన్ జట్టు, సెమీ ఫైనల్ చేరలేకపోయింది. సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా నిలవాలంటే గ్రూప్ టాపర్ ఇండియా, ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియాకి పూర్తి సపోర్ట్ చేశారు పాక్ ఫ్యాన్స్...
అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. జానీ బెయిన్ స్టో 109 బంతుల్లో 111 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనలో కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు...
అయితే రోహిత్ శర్మ 109 బంతుల్లో 15 ఫోర్లతో 102 పరుగులు, విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 7 ఫోర్లతో 66 పరుగులు చేసి రెండో వికెట్‌కి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రిషబ్ పంత్ 32, హార్ధిక్ పాండ్యా 45 పరుగులు, మహేంద్ర సింగ్ ధోనీ 42 పరుగులు చేసినా చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో టీమిండియాకి ఓటమి తప్పలేదు...
Ind
భారత జట్టు, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరిన టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి... ఇంటిదారి పట్టింది. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఇరుక్కుంది భారత జట్టు...
ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై టీమిండియాకి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. అప్పుడెప్పుడో 2003 వన్డే వరల్డ్ కప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై విజయం అందుకుంది భారత జట్టు. ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో కివీస్, టీమిండియాకి పెద్ద గండంగా మారింది...
2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతుల్లో సెమీస్‌లో ఓడిన టీమిండియా, 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ పాక్‌తో పరాజయం తర్వాత కివీస్ చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ టీమిండియాని చిత్తు చేసింది న్యూజిలాండ్...
సౌతాఫ్రికాపై గెలిస్తే టీమిండియా టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరుతుంది. గ్రూప్ 1లో రెండు మ్యాచుల్లో నెగ్గిన న్యూజిలాండ్, సెమీస్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ చేసుకుంది. దీంతో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి...
ఒకవేళ సౌతాఫ్రికాతో మ్యాచ్ ఓడిపోతే పాకిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. అయితే భారత జట్టు ఆ తర్వాతి మ్యాచుల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. టాప్ 2గా ముగించినా గ్రూప్ 1లో న్యూజిలాండ్ టాప్‌లో ముగిస్తే సెమీస్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తప్పదు...
మొత్తానికి వేరే గ్రూప్‌లో ఉండడం వల్ల న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ని తప్పించుకున్న భారత జట్టును సెమీ ఫైనల్‌లో మాత్రం కివీ గండం వెంటాడుతోంది. 20 ఏళ్లుగా న్యూజిలాండ్‌ని ఐసీసీ టోర్నీల్లో ఓడించలేకపోయిన టీమిండియా, ఈసారి ఆ గండాన్ని దాటగలదా? లేదో చూడాలి...