ఆ విషయంలో తగ్గేదిలే! ప్రతీ మ్యాచ్‌లోనూ మార్పులు ఉంటాయి... కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్...
కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమ్‌లో ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తూ, ఓపెనర్లను ఛేంజ్ చేస్తూ వచ్చిన రోహిత్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ ఈ ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదని స్పష్టం చేశాడు...
సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడాలను ఓపెనర్లుగా ప్రయోగించిన టీమిండియా... ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌తో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపింది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముందు ఈ ప్రయోగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ...
Rohit Sharma
‘ఏ ప్లేయర్ ఎలా ఆడుతున్నాడు, ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడనే సమాచారం కూడా తెలియకుండా టీమ్‌ని తయారుచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఎవరు ఎలాంటి ఫామ్‌లో ఉన్నారు? ఎలా పరుగులు చేస్తున్నారనే సమస్త సమాచారం అందుబాటులో ఉంది...
ఆ డేటాని పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే మా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండాలనే దాన్ని నిర్ణయించాం. అయితే ప్రతీ మ్యాచ్‌లో ఒకే టీమ్‌ని కొనసాగించాలని అనుకోవడం లేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ ఒకటి రెండు మార్పులు ఉండడం పక్కా...
Rohit Sharma
టీ20 వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో ప్రెషర్ అనేది కచ్ఛితంగా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్‌పై గెలవడమే మా ముందున్న ఛాలెంజ్. 9 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాం. ఈసారి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు భారత సారథి రోహిత్ శర్మ..
Image credit: PTI
ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భారత జట్టు, పాకిస్తాన్‌లో అడుగుపెడుతుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ విషయంపై కూడా రోహిత్ శర్మ స్పందించాడు. ‘అవన్నీ మాకు తెలీదు. ఇప్పుడు మా ముందున్న లక్ష్యం రేపటి మ్యాచ్ ఎలా గెలవాలనేదే... వచ్చే ఏడాది జరిగే మ్యాచుల గురించి ఇప్పుడు ఆలోచించేంత తీరిక లేదు...
Rohit Sharma
బీసీసీఐ తీసుకునే నిర్ణయం మీదే మేం ఆడాలా? వద్దా? అనే తేలుతుంది. అంతేకానీ మేమేం చెప్పలేం కదా.. అది మాకు సంబంధం లేని విషయం..’ అంటూ వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ...