సింగ్ ఈజ్ కింగ్... ‘ఖలీస్తానీ’ అని ట్రోల్ చేసినవారికి ‘ఖతర్నాక్’ పర్ఫామెన్స్‌తో బదులిచ్చిన అర్ష్‌దీప్ సింగ్...
అర్ష్‌దీప్ సింగ్... ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి టీమిండియాలోకి వచ్చిన భారత బౌలర్. ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్‌లో పాక్ బ్యాటర్ అసిఫ్ ఆలీ ఇచ్చిన క్యాచ్‌ని అందుకోలేకపోయాడు అర్ష్‌దీప్ సింగ్. చేతుల్లో పడిన బంతి, నేల జారవిడచడంతో అర్ష్‌దీప్ సింగ్‌పై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి... ఈ ట్రోల్స్‌కి తన స్టైల్‌లో పర్ఫామెన్స్‌తోనే సమాధానం ఇచ్చాడు అర్ష్‌దీప్ సింగ్...
క్యాచ్ జారిపోవడం సర్వ సాధారణ విషయం. అయితే ఆసియా కప్ సూపర్ 4 రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తర్వాత అర్ష్‌దీప్ సింగ్‌పై సైబర్ దాడి చేశారు నెటిజన్లు. అర్ష్‌దీప్ సింగ్ ‘ఖలీస్థానీ’ అంటూ తీవ్ర స్థాయిలో దూషిస్తూ పోస్టులు పెట్టారు...
నెలన్నర గడిచిన తర్వాత టీ20 వరల్డ్ కప్‌కి ముందు జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో అతను లేని లోటును ఎవరు తీరుస్తారని ఆతృతగా ఎదురుచూశారు టీమిండియా అభిమానులు. ఆ లోటు తీర్చే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
Arshdeep Singh
రెండో ఓవర్‌లో మొదటి బంతికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన పాక్ కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు బాబర్ ఆజమ్.
Babar Azam
బాబర్ ఆజమ్‌కి ఇది ఐదో డకౌట్ కాగా షాహీన్ ఆఫ్రిదీ 4 సార్లు డకౌట్ అయ్యాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ కూడా అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది పాకిస్తాన్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో షాహీన్ ఆఫ్రిదీ... భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లను అవుట్ చేయగా, 2022 టీ20 వరల్డ్ కప్‌లో అర్ష్‌దీప్ సింగ్, పాక్ ఓపెనర్లు ఇద్దరినీ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేర్చి... పర్ఫెక్ట్ రివెంజ్ ఇచ్చిపడేశాడు...
arshdeep
టీ20 వరల్డ్ కప్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన రెండో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. ఇంతకుముందు 2009లో భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా, షకీబ్ అల్ హసన్‌కి అవుట్ చేయగా... అర్ష్‌దీప్ సింగ్, బాబర్‌ని పెవిలియన్ చేర్చాడు...
పాక్ టాప్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌లను పవర్ ప్లేలోపు, అదీ సింగిల్ డిజిట్‌లో అవుట్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు అర్ష్‌దీప్ సింగ్. వరల్డ్ కప్‌లో టీమిండియాపై గోల్డెన్ డకౌట్ అయిన రెండో పాక్ బ్యాటర్‌గా నిలిచాడు బాబర్ ఆజమ్. 1992లో ఇమ్రాన్ ఖాన్, 2022లో బాబర్ ఆజమ్ ఈ ఫీట్ సాధించారు...
Arshdeep Singh
ఆసియా కప్ 2022 టోర్నీలో తాను క్యాచ్ డ్రాప్ చేసిన అసిఫ్ ఆలీని కూడా అవుట్ చేసి... రివెంజ్ తీర్చుకున్నాడు అర్ష్‌దీప్ సింగ్. ‘ఖలీస్థానీ’ అంటూ విమర్శించిన నెటిజన్లకి ఖతర్నాక్ పర్ఫామెన్స్‌తోనే సమాధానం ఇచ్చాడు అర్ష్‌దీప్ సింగ్...