MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతనే నా ఛీర్ లీడర్, ఆ టైంలో విరాట్ కోహ్లీ పక్కనే ఉంటూ... అనుష్క శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

అతనే నా ఛీర్ లీడర్, ఆ టైంలో విరాట్ కోహ్లీ పక్కనే ఉంటూ... అనుష్క శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

భారత సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల జోడి సోషల్ మీడియాలో ప్రపంచంలోనే మోస్ట్ ఫాలోయింగ్ సెలబ్రిటీ కపుల్. ఈ ఇద్దరి గారాల కుట్టీ వామికను సోషల్ మీడియాకి దూరంగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు కోహ్లీ, అనుష్క...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Dec 11 2021, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

డెలివరీ తర్వాత కూతురి కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క శర్మ... మళ్లీ వరుసగా సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా గ్రేజియా అనే మ్యాగజైన్ కోసం హాట్ లుక్స్‌లో ఓ ఫోటో షూట్ నిర్వహించి, అందర్నీ ఆశ్చర్యపరిచిన అనుష్క శర్మ... ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

‘తల్లి అవ్వబోతున్న అనే విషయం తెలిసినప్పుడు నాకు కలిగిన ఆనందం మరిచిపోలేను. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలనే విషయం నాకు అనుభవం నేర్పింది. నా అదృష్టమో మరేంటో తెలీదు కానీ ఆ సమయంలో నేను, విరాట్ కలిసి చాలా సమయం గడిపేవాళ్లం. 

310

లాక్‌డౌన్ ఉండడంతో మ్యాచులు జరిగేవి కావు. ఇద్దరం మాకు దొరికిన విలువైన సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశాం. ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమైన తర్వాత విరాట్, ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. నేను ఖాళీగా ఉన్నా, నా పరిస్థితి కారణంగా అతనికి కంపెనీ ఇవ్వలేకపోయేదాన్ని...

410

నా మొదటి మూడు నెలలు చాలా బాగుంది. విరాట్ నాతో ఉండడం వల్ల ఆ మూడు నెలలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు... అతను ఆ టైంలో నా చేతి పట్టుకుని, ఓ ఛీర్ లీడర్‌‌లా నన్ను ఎంకరేజ్ చేసేవాడు...

510

నేను ఆ సమయంలో బేబీ షవర్ కావాలని కోరుకున్నా. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఫంక్షన్ చేసినా, అందరినీ క్వారంటైన్‌కి పంపించి, ఇబ్బంది పెట్డం కరెక్ట్ కాదని అనిపించింది. 

610

అందుకే నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో కూడా ఈ విషయం గురించి చెప్పలేదు... అయితే ఇంట్లోనే, మా ఫ్యామిలీతో కలిసి చిన్నగా ఆ కార్యక్రమం చేశాం...’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శర్మ...

710

ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో గర్భంతోనే మ్యాచులకు హాజరైంది అనుష్క శర్మ. ఐపీఎల్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ నేరుగా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లగా, అనుష్క శర్మ స్వదేశానికి తిరిగి వచ్చేసింది. 

810

ఆస్ట్రేలియా టూర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, ఆడిలైడ్ టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చేశాడు.  ఆడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ వెటర్నిటీ సెలవుల కింద స్వదేశానికి వచ్చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు.

910

అయితే విరాట్ కోహ్లీ మాత్రం జీవితంలో ఒకేసారి వచ్చే మధురానుభూతులను దేని కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేనంటూ కామెంట్ చేశాడు...

1010

డిసెంబర్ 11, 2017న ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరగగా, జనవరి 11, 2021న వీరికి వామిక జన్మించింది. ఇప్పటిదాకా వామిక కోహ్లీ ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడిన విరుష్క జోడీ, తమ పాప పెరిగి పెద్దదైన తర్వాత, సోషల్ మీడియా గురించి తెలుసుకున్న తర్వాతే ఆమె కోరుకుంటే ఐడెంటిటీ రివీల్ చేస్తామని స్పష్టం చేశారు. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved