- Home
- Sports
- Cricket
- ఫెయిలైన ఆ ముగ్గురినీ వదిలేసి, అక్షర్ పటేల్‌ను తప్పిస్తారా... బీసీసీఐ సెలక్టర్లపై తీవ్ర విమర్శలు...
ఫెయిలైన ఆ ముగ్గురినీ వదిలేసి, అక్షర్ పటేల్‌ను తప్పిస్తారా... బీసీసీఐ సెలక్టర్లపై తీవ్ర విమర్శలు...
T20 World cup 2021: ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా 2021 టీ20 వరల్డ్‌కప్ జట్టులో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి తుదిజట్టులో చోటు ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం మరోసారి సెలక్టర్లపై తీవ్రమైన విమర్శలు రావడానికి కారణమవుతోంది...

15 మ్యాచుల్లో 18 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్‌కి టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో చోటు దక్కడం సరైన నిర్ణయమే. అదీకాకుండా జట్టుకి అవసరమైన సమయాల్లో వికెట్లు తీస్తూ, మ్యాచ్ విన్నర్‌గా మారాడు శార్దూల్...
అయితే శార్దూల్ ఠాకూర్‌కి చోటు కల్పించడం కోసం అక్షర్ పటేల్‌ను తప్పించడమే బీసీసీఐ సెలక్టర్లపై విమర్శలు రావడానికి కారణమైంది...
ఐపీఎల్ 2021 సీజన్‌లో 6.52 ఎకానమీతో బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్, 11 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టి మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు...
శార్దూల్ ఠాకూర్‌కి తుదిజట్టులో చోటు ఇవ్వాలంటే రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహార్, హార్ధిక్ పాండ్యా వంటి ఫెయిలైన ప్లేయర్లను తప్పించవచ్చు కదా అనేది టీమిండియా ఫ్యాన్స్ ఆవేదన...
ఐపీఎల్ 2021 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 7.44తో పరుగులు సమర్పించడమే కాకుండా, కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు...
అలాగే ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహార్, ఫస్టాఫ్‌లో ఆకట్టుకున్నా... యూఏఈలో జరిగి సెకండాఫ్‌లో 4 మ్యాచులు ఆడి రెండే వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 7.73గా ఉంది...
అలాగే హార్ధిక్ పాండ్యా అయితే సీజన్ మొత్తంలో బౌలింగ్ చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ చెప్పుకోదగ్గ మెరుపులు మెరిపించిన దాఖలాలు కూడా లేవు...
యూఏఈలో 8 మ్యాచులు ఆడి 6.13 ఎకానమీతో 14 వికెట్లు తీసిన ఆర్‌సీబీ బౌలర్ యజ్వేంద్ర చాహాల్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని అందరూ ఆశించారు.
అయితే రెండేళ్లుగా భారత టీ20 జట్టులో ప్రధాన పేసర్‌గా ఉంటున్న యజ్వేంద్ర చాహాల్‌ను మాత్రం వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయలేదు సెలక్టర్లు...
అలాగే 6.78 ఎకానమీతో బౌలింగ్ చేసి సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన మహ్మద్ సిరాజ్‌కి కూడా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది...
మిగిలినవారి సంగతి ఎలా ఉన్నా, 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడం వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత సెలక్టర్లు, ఈసారి యజ్వేంద్ర చాహాల్‌ను పక్కనబెట్టి ట్రోలింగ్‌కి టార్గెట్ అవుతారని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...