పూజారా క్లాస్... రిషబ్ పంత్ మ... మ... మాస్... ఆస్ట్రేలియాకి చెమటలు పట్టిస్తున్న టీమిండియా...

First Published Jan 11, 2021, 7:23 AM IST

సిడ్నీ టెస్టు మరింత ఆసక్తికరంగా మారింది. 407 పరుగుల విజయలక్ష్యంతో ఐదో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా... కెప్టెన్ అజింకా రహానే వికెట్ త్వరగానే కోల్పోయినా రిషబ్ పంత్ దూకుడైన ఇన్నింగ్స్, ఛతేశ్వర్ పూజారా క్లాస్ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు లంచ్ విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. భారతజట్టు విజయానికి ఇంకా 201 పరుగులు కావాలి.

ఓవర్‌నైట్ స్కోరు 98/2 వద్ద ఐదోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది...

మరో 4 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ అజింకా రహానే అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 4 పరుగులు చేసిన రహానే... లియాన్ బౌలింగ్‌లో వైడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కించుకున్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మొదట నెమ్మదిగా బ్యాటింగ్ చేసి, ఆ తర్వాత ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు...

ఆస్ట్రేలియాలో ఆసీస్‌పై వరుసగా పదో ఇన్నింగ్స్‌లో 25+ స్కోరు నమోదుచేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా తన రికార్డును తానే మెరుగుపరుచుకున్న రిషబ్ పంత్... హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్‌ కీపర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు రిషబ్ పంత్. సయ్యద్ కిర్మణీ 471 పరుగుల రికార్డును అధిగమించాడు పంత్.

2006 నుంచి గత 15 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఒకే సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్. పూజారా గత పర్యటనలో ఒకే సెషన్‌లో 77 పరుగులు చేయగా, రిషబ్ పంత్ ఉదయం సెషన్‌లో 73 పరుగులు చేశాడు.

రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా కలిసి నాలుగో వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు... ఐదో రోజు సెంచరీ భాగస్వామ్యం రావడంతో టీమిండియా గట్టి పోటీ ఇస్తోంది.

97 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేసిన రిషబ్ పంత్... ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించాడు. ముఖ్యంగా స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో బౌండరీలు రాబట్టాడు పంత్.

147 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... మొదటి ఇన్నింగ్స్ కంటే మెరుగైన స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు.

లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా స్కోరుకి ఇంకా 201 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా... విజయం కోసం ప్రయత్నించాలని చూస్తోంది.

అయితే దూకుడుగా ఆడుతున్న పంత్ అవుట్ అయితే డ్రా కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

ఐదో రోజు మొదటి సెషన్‌లో రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా ఇచ్చిన క్యాచ్‌లను జారవిడిచిన ఆస్ట్రేలియా ఫీల్డర్లు  మూల్యం చెల్లించుకున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?