8 వికెట్లు... 309 పరుగులు... మూడు సెషన్లు... ఇదీ ఆఖరి రోజు సిడ్నీ టెస్టు లెక్క...
First Published Jan 10, 2021, 12:43 PM IST
సిడ్నీ వేదికగా జరుగుతున్న పింక్ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 312/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, టీమిండియా ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో పాటు శుబ్‌మన్ గిల్ రాణించడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది టీమిండియా. భారత విజయలక్ష్యం ఆఖరి రోజు 309 పరుగులు కాగా, ఆస్ట్రేలియా గెలవాంటే మిగిలిన 8 వికెట్లు తీయాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ అవుట్ కాకుండా ఉండి ఉంటే, టీమిండియా గెలుపుపై మరిన్ని ఆశలు ఉండేవి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?