- Home
- Sports
- Cricket
- Swiggy Tributes To Kohli: కోహ్లికి తనదైన స్టైల్ లో ట్రిబ్యూట్ ఇచ్చిన స్విగ్గీ.. స్పెషల్ వంటకం రెడీ..
Swiggy Tributes To Kohli: కోహ్లికి తనదైన స్టైల్ లో ట్రిబ్యూట్ ఇచ్చిన స్విగ్గీ.. స్పెషల్ వంటకం రెడీ..
Virat Kohli Test Captaincy: గతేడాది ఓ టాక్ షో సందర్భంగా కోహ్లి తనకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి..? అది ఎక్కడ దొరుకుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా స్విగ్గీ...

టెస్టు క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లికి ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. తమను ఇన్నాళ్లుగా అలరించినందుకు గాను అతడికి ఎంతో ఇష్టమైన వంటకాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
ట్విట్టర్ వేదికగా స్పందించిన స్విగ్గీ.. ‘ఏడేండ్లుగా మెన్ ఇన్ బ్లూ, టీమిండియా వైట్ జెర్సీపై మరింత ప్రేమ పెరిగేలా చేసినందుకు కృతజ్ఞతలు..
మేము మీకు (కోహ్లికి) ఈరోజు స్పెషల్ రామ్ చోలే భాతూర్ ను అందిస్తాం. అందులో కొంచెం ఉల్లిపాయలు, పుదీన చట్నీ, ఎండుమిర్చి తో చేసిన స్పెషల్ వంటకం మీకోసమే సిద్ధం చేశాం..’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
ఫిట్నెస్ కు ఎంతో ప్రాముఖ్యతనిచ్చే కోహ్లి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అయితే ఎంత ఫిట్నెస్ ప్రేమికుడైనా.. ఎన్నో పేరు ప్రఖ్యాతులు గడించినా కోహ్లికి ఢిల్లీలో రోడ్ సైడ్ ఫుడ్ గా అధిక ప్రాచుర్యం పొందిన రామ్ కే చోలో భాతురేను అమితంగా ఇష్టపడతాడు.
ఈ విషయాన్ని అతడు గతేడాది గౌరవ్ కపూర్ హోస్ట్ చేసిన ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ షో లో చెప్పాడు. ఎంత ఫైవ్ స్టార్ హోటల్స్ లో కాస్ట్లీ ఫుడ్ తిన్నా రామ్ కే చోలే టేస్ట్ మాత్రం రాదని కోహ్లి తెలిపాడు.
పూరి, శనగలతో కలిపి చేసే ఈ వంటకం.. ఢిల్లీలో ఫేమస్. దేశ రాజధాని వీధులలో విరివిగా దొరికే ఈ ఫుడ్ అంటే ఢిల్లీ వాసులు చెవి కోసుకుంటారు. పుదీనా చట్నీతో కలుపుకుని తింటే దీని రుచి అమోఘంగా ఉంటుంది.