- Home
- Sports
- Cricket
- నీ బౌలింగ్‌లో స్వీప్ ఆడితేనే వికెట్లను కాపాడుకోగలరా? జడేజాకు మంజ్రేకర్ సూటి ప్రశ్న.. సూపర్ ఆన్సర్ ఇచ్చిన జడ్డూ
నీ బౌలింగ్‌లో స్వీప్ ఆడితేనే వికెట్లను కాపాడుకోగలరా? జడేజాకు మంజ్రేకర్ సూటి ప్రశ్న.. సూపర్ ఆన్సర్ ఇచ్చిన జడ్డూ
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో ముగిసిన రెండో టెస్టులో టీమిండియా సూపర్ స్టార్ రవీంద్ర జడేజా మరోసారి అదరగొట్టాడు. తొలి టెస్టులో మాదిరిగానే బౌలింగ్ లో విజృంభించి ఆసీస్ కు ముచ్చెమటలు పట్టించాడు.

భారత ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ధాటికి ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా విలవిల్లాడింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఆ జట్టు రెండో రోజు కాస్త ప్రతిఘటించినా మూడో రోజు మాత్రం తేలిపోయింది. రవీంద్రుడి స్పిన్ మాయాజాలానికి ట్రావిస్ హెడ్, లబూషేన్ మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజాను వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.. ‘కంగ్రాట్స్ జడ్డూ మరోసారి అదరగొట్టావ్. అసలు నీ బౌలింగ్ లో ఎలా ఆడితే వికెట్ కాపాడుకోగలం చెప్పు. స్వీప్ షాట్స్ ఆడితే వికెట్లు కోల్పోకుండా ఏమైనా ఛాన్స్ ఉంటుందా..? చెప్పు..’అని అడిగాడు.
మంజ్రేకర్ ప్రశ్నకు జడ్డూ సమాధానం చెబుతూ.. ‘లేదు. లేదు. ఈ వికెట్ మీద అయితే కాదు..’ అని నవ్వుతూ అన్నాడు. అంతేగాక జడ్డూ కొనసాగిస్తూ.. ‘నేను నా బౌలింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇటువంటి వికెట్స్ మీద బౌలింగ్ చేయడం నాకు బాగా ఇష్టం. బంతి ఇక్కడ మంచి స్పిన్ అవుతుంది. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంది..
వాళ్లు (ఆస్ట్రేలియా) స్వీప్ షాట్లు ఆడతారని నాకు తెలుసు. స్వీప్స్ తో పాటు రివర్స్ స్వీప్స్ ఆడతారని నేను కూడా ఊహించా. నా ఐడియా చాలా సింపుల్. వాళ్లు ఎలాగైనా ఆడనియి. స్టంప్స్ ను టార్గెట్ గా చేసుకున్నా. ఒకవేళ వాళ్లు ఏదైనా తప్పు చేస్తే మాత్రం అంతే సంగతులు. వికెట్లు నేలకూలాల్సిందే. ఇటువంటి పిచ్ ల మీద స్వీప్స్ పెద్దగా వర్కవుట్ కావు...’అని బదులిచ్చాడు.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు జడ్డూ బౌలింగ్ లో స్వీప్ షాట్లు ఆడేందుకు శతవిధాలా యత్నించారు. కానీ ఆ ప్రయత్నాలో వికెట్లు కోల్పోయారు. జడేజా మొత్తంగా రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీయగా ఇందులో ఐదు క్లీన్ బౌల్డ్ లే. అందులోనూ ముగ్గురు బ్యాటర్లు స్వీప్ షాట్లు ఆడబోయి బోల్తా కొట్టినవారే.
మ్యాచ్ ముగిసిన తర్వాత మాథ్యూ హెడన్, అలెన్ బోర్డర్ లు కూడా ఆసీస్ ఆటను తప్పుబట్టారు. జడేజా ఎలా బౌలింగ్ చేస్తున్నాడనే విషయాన్ని గమనించకుండా ప్రతీసారి స్వీప్ షాట్లు ఆడి వికెట్లను సమర్పించుకున్నారని, స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ పై ఇంత చెత్త ఆట ఆడి పరువు తీసుకున్నారని దుయ్యబట్టారు. జడ్డూ తెలివిగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను భారత్ వైపునకు తిప్పాడని వ్యాఖ్యానించారు.