- Home
- Sports
- Cricket
- సూర్యకుమార్ యాదవ్ చాలా లక్కీ! వేరే ఏ టీమ్ కూడా అతన్ని వరల్డ్ కప్‌కి సెలక్ట్ చేయదు... టామ్ మూడీ కామెంట్స్..
సూర్యకుమార్ యాదవ్ చాలా లక్కీ! వేరే ఏ టీమ్ కూడా అతన్ని వరల్డ్ కప్‌కి సెలక్ట్ చేయదు... టామ్ మూడీ కామెంట్స్..
వన్డేల్లో 26 సగటు ఉన్న ఓ ప్లేయర్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే అవకాశం దక్కడం అంటే అది మామూలు విషయం కాదు. కేవలం టీ20 పర్ఫామెన్స్ కారణంగా సూర్యకుమార్ యాదవ్‌కి వన్డే ప్రపంచ కప్ ఆడే అవకాశం దక్కింది..

Suryakumar Yadav
వన్డేల్లో 55కి పైగా సగటు ఉన్న సంజూ శాంసన్‌ని పక్కనబెట్టి... సూర్యకుమార్ యాదవ్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సెలక్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...
తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రకటించిన భారత జట్టుపై ఇదే విధంగా స్పందించాడు..
Suryakumar Yadav
‘భారత వరల్డ్ కప్ జట్టులో నాకు పెద్ద సర్‌ప్రైజ్‌లేమీ కలగలేదు. అయితే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో తిలక్ వర్మకు చోటు దక్కి ఉంటే బాగుండేది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటే బాగుండేది...
అదీకాకుండా తిలక్ వర్మ స్పిన్ బౌలింగ్‌ని చక్కగా ఎదుర్కొంటాడు. వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో చోటు దక్కడం కేవలం సూర్యకుమార్ యాదవ్ అదృష్టమే. లేకపోతే అతను ఉన్న ఫామ్‌కి వేరే ఏ టీమ్ కూడా అతన్ని ప్రపంచ కప్‌కి ఎంపిక చేసేది కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టామ్ మూడీ..
Suryakumar Yadav
2023 ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. అయితే ఇప్పటిదాకా ఒక్క వన్డే కూడా ఆడని తిలక్ వర్మ, 2023 వన్డే వరల్డ్ కప్‌కి ప్రకటించిన 15 మంది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన 17 మందిలో తిలక్ వర్మతో పాటు ప్రసిద్ధ్ కృష్ణని తొలగించి, మిగిలిన 15 మందిని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది బీసీసీఐ. అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌లో భారత జట్టు, మొదటి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది..