- Home
- Sports
- Cricket
- 15 ఏళ్ల యువీ రికార్డును కొట్టేశారు... సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ ఊరకొట్టుడుకి...
15 ఏళ్ల యువీ రికార్డును కొట్టేశారు... సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ ఊరకొట్టుడుకి...
టీమిండియాని ఎన్నో ఏళ్లుగా వేధించిన సమస్య మిడిల్ ఆర్డర్ వైఫల్యం. అయితే విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం టాపార్డర్ పెద్దగా రాణించకపోగా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అదరగొట్టారు... ముఖ్యంగా ఈ టీ20 సిరీస్‌లో వెంకటేశ్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు...

తొలి టీ20 మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యఛేదనలో 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించారు...
మూడో టీ20 మ్యాచ్‌లో 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కలిసి మరోసారి భారత జట్టును ఆదుకున్నారు...
సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో ఓ ఫోర్, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ కాగా వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కలిసి 37 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా ఆఖరి 5 ఓవర్లలో 86 పరుగులు రాబట్టింది భారత జట్టు.
టీ20ల్లో ఆఖరి ఐదు ఓవర్లలో టీమిండియాకి ఇదే అత్యధికం. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆఖరి ఐదు ఓవర్లలో రాబట్టిన 80 పరుగుల రాబట్టింది భారత జట్టు...
యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లతో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడడంతో ఆఖరి 5 ఓవర్లలో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది...
యువీ 15 ఏళ్ల రికార్డును సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కలిసి అధిగమించేశారు. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ 194.54 స్ట్రైయిక్ రేటుతో పరుగులు సాధించాడు...
మూడు మ్యాచుల్లో కలిపి 92 పరుగులు చేసిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, 184 స్ట్రైయిక్ రేటుతో అదరగొట్టాడు...
టీ20ల్లో ఇంగ్లాండ్‌పై, శ్రీలంకపై, న్యూజిలాండ్‌పై జరిగిన సిరీసుల్లో హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్, వెస్టిండీస్‌తోనూ ఈ ఫీట్ సాధించాడు...
2021 నుంచి టీమిండియా తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్ 2లో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెరో ఐదేసి హాఫ్ సెంచరీలతో టాప్‌లో ఉండగా కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ నాలుగేసి హాఫ్ సెంచరీలు నమోదు చేశారు...