ధోనీ, ఇదేనా నీ క్రికెట్ స్పిరిట్... సూర్యకుమార్ యాదవ్‌ను చూసి నేర్చుకో...
24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్, మ్యాచ్‌లో గెలుస్తుందని, అదీ ముంబై ఇండియన్స్‌లంటి టీమ్‌ను ఓడించి విజయాన్ని అందుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు... అయితే తన ఇన్నింగ్స్‌తో అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు రుతురాజ్ గైక్వాడ్...

డుప్లిసిస్, మొయిన్ ఆలీ, సురేష్ రైనా, ఎమ్మెస్ ధోనీ వంటి సీనియర్లు ఫెయిల్ అయిన చోట... బాధ్యతగా బ్యాటింగ్ చేసి, చెన్నై సూపర్ కింగ్స్‌కి 150+ స్కోరుని అందించాడు రుతురాజ్ గైక్వాడ్...
58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్... యూఏఈలో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ నమోదుచేసి... ముంబై ఇండియన్స్‌పై అత్యధిక స్కోరు చేసిన చెన్నై ప్లేయర్‌గా నిలిచాడు...
యూఏఈలో జరిగిన సీఎస్‌కే ఆడిన గత నాలుగు మ్యాచుల్లోనూ వరుసగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐదు అవార్డులు గెలిచిన ఓపెనర్‌గా మైక్ హుస్సీ, షేన్ వాట్సన్ తర్వాతి స్థానంలో నిలిచాడు...
కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగి, చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌ను, ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ కుమార్ అభినందించాడు...
సీఎస్‌కే ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వద్దకు వెళ్లి, తల నిమురుతూ అభినందించిన సూర్యకుమార్ యాదవ్, చెన్నై ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు...
ఇదే సమయంలో ముంబై ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో సీఎస్‌కే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, సొంత జట్టు ప్లేయర్ డీజే బ్రావోపై సీరియస్ అయ్యాడు...
సౌరబ్ తివారీ కొట్టిన ఓ షాట్, బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి ఎగిరి... క్యాచ్ అందుకోవడం కోసం మహేంద్ర సింగ్ ధోనీ పరుగెత్తాడు. అక్కడికి దగ్గర్లోనే ఫీల్డింగ్ చేస్తున్న డ్వేన్ బ్రావో కూడా క్యాచ్ కోసం వచ్చాడు... ధోనీ క్యాచ్ జారవిడిచాడు..
క్యాచ్ వదిలేసిన తర్వాత ఆ కోపాన్ని బ్రావోపై చూపించాడు ఎమ్మెస్ ధోనీ. నిజానికి ఆ క్యాచ్ బ్రావో చేతుల్లోకి వచ్చింది. మాహీ అడ్డు రావడంతో క్యాచ్ జారిపోయింది... బ్రావోకి అడ్డొచ్చి, మళ్లీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మాహీ...
దీంతో సోషల్ మీడియాలో మాహీపై ట్రోలింగ్ మొదలైంది. సూర్యకుమార్ యాదవ్, ప్రత్యర్థి ప్లేయర్‌ను బాగా ఆడావని మెచ్చుకుంటే, మాహీ మాత్రం సీఎస్‌కేకి మ్యాచ్ విన్నర్‌గా మారిన బ్రావోపై నోరుపారేసుకున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్...
రవీంద్ర జడేజా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన డేజీ బ్రావో 8 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేసి, మెరుపులు మెరిపించాడు...
ఆ తర్వాత బౌలింగ్‌లోనూ 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి... చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీ రోల్ పోషించాడు..