- Home
- Sports
- Cricket
- ఆ ప్లేస్‌లో విరాట్ ఎందుకు దండగ! సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించండి... టీమిండియాకి గంభీర్ సలహా..
ఆ ప్లేస్‌లో విరాట్ ఎందుకు దండగ! సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించండి... టీమిండియాకి గంభీర్ సలహా..
ఆసియా కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా తరుపున మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్ 2022 టోర్నీలో మొట్టమొదటి హాఫ్ సెంచరీ బాదిన భారత బ్యాటర్‌గానూ నిలిచాడు...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్ డౌన్‌లో వచ్చి 59 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ వికెట్‌ని త్వరగా కోల్పోయిన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ వికెట్‌ని 5 ఓవర్లలోపే కోల్పోయింది...
Image credit: Getty
వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చే విరాట్ కోహ్లీ, ఓ ఎండ్‌లో వికెట్ పడకుండా అడ్డుగోడలా నిలబడుతూ ఇన్నింగ్స్ నిర్మించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఫ్రీగా షాట్లు ఆడేందుకు ఎక్కువగ సింగిల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేయడంపైనే ఫోకస్ పెడుతున్నాడు కోహ్లీ...
Image credit: Getty
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రవీంద్ర జడేజాని నాలుగో స్థానంలో పంపించిన టీమిండియా, హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి పంపింది. తనకి అచొచ్చిన స్థానంలో సూర్య విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు...
26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, గ్రౌండ్‌లో 360 డిగ్రీస్ బ్యాటింగ్‌తో భారత జట్టు 192 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సూర్య లేకపోతే టీమిండియా స్కోరు 170+ దాటడం కూడా కష్టమేననిపించింది..
Image credit: Getty
‘ఫామ్‌లోకి రావడానికి ఆడుతున్న విరాట్ కోహ్లీని మూడో స్థానంలో పంపడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫామ్‌లో ఉండి, ఫ్రీగా బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఆ ప్లేస్‌ని కరెక్టుగా వాడుకోగలడు. ఇంగ్లాండ్‌లో మిగిలిన బ్యాటర్లు ఇబ్బంది పడిన చోటు సూర్యకుమార్ యాదవ్ చాలా స్వేచ్ఛగా పరుగులు సాధించాడు...
వెస్టిండీస్ టూర్‌లో అద్భుతంగా అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్‌కి మంచి అనుభవం కూడా ఉంది. అతనికి ఇప్పుడు 30 ఏళ్లు. 21, 22 ఏళ్ల కుర్రాళ్లు అయితే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకుంటారు.... 30ల్లో ఉన్న సూర్యకు పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలో తెలుసు...
ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కి తగినంత సమయం ఇవ్వాలంటే అతని వన్‌డౌన్‌లో పంపడమే కరెక్ట్. విరాట్ కోహ్లీకి ఎంతో అనుభవం ఉంది. అతను నాలుగో స్థానంలో కూడా కుదురుకోగలడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగలడు...
వరల్డ్ కప్ దగ్గర పడుతోంది. ఇకపై సూర్యకుమార్ యాదవ్‌ని వన్ డౌన్‌లో పంపి, ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి... అతను ఆ ప్లేస్‌లో కుదురుకుంటే, టీమిండియాకి తిరుగే ఉండదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...